సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్‌లో జరుగనున్న క్రికెట్ మ్యాచ్ జరుగనుంది , అయితే మ్యాచ్ రాత్రి ముగియనుండడం తో తిరికి ఇంటికి వెళ్లే వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రి 1 గంటల వరకు మెట్రో సర్వీసులను నడపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు .
ఈ స్పెషల్ సర్వీసులు కేవలం స్టేడియం స్టేషన్ నుంచే ఉంటాయి. ఇక అమీర్‌పేట్, జేబీఎస్ స్టేషన్ల నుంచి కనెక్షన్ ట్రైన్ సర్వీస్‌లు అందుబాటులో ఉండనున్నాయి. అటు ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో ఉప్పల్, స్టేడియం, NGRI మెట్రో స్టేషన్లలో మాత్రమే ఎంట్రీ గేట్స్ తెరిచి ఉంటాయని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. అలాగే దిగబోయే ప్రయాణీకుల కోసం మిగతా స్టేషన్లలో ఎగ్జిట్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయని తెలిపారు. కాగా, మెట్రో స్టేషన్లలో రాత్రి 10 గంటల వరకే టికెట్ కౌంటర్లు తెరిచి ఉంటాయని.. రిటర్న్ టికెట్లు కొనుగోలు చేసేవారు రాత్రి 10 గంటలలోపు తీసుకోవాలని సూచించారు. అటు రాత్రి 10.15 గంటల తర్వాత నుంచి డిజిటల్ టికెట్స్ కొనుగోలుకు ఛాన్స్ ఉండదని పేర్కొన్నారు.
"10 వ తరగతి అర్హతతో డ్రోన్ పైలెట్ గ మారవచ్చు "-DFI ప్రెసిడెంట్ స్మిత్ షా
క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ కూడా శుభవార్త తెలిపింది . సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపధ్యంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం సిటీ బస్సు సర్వీసులను పొడిగించింది. ఉప్పల్ స్టేడియం నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ మేనేజర్ సీహెచ్ వెంకన్న వెల్లడించారు. మేడ్చల్, హకీంపేట్, సికింద్రాబాద్, జేబీఎస్, జీడిమెట్ల, ఘట్‌కేసర్, కోఠి, మోహిదీపట్నం, పటాన్‌చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు.
Share your comments