News

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి తెలంగాణ హరిత నిధి..వసూలు అయిన మొత్తం ఇంతా!

S Vinay
S Vinay

ఈ ఆర్థిక సంవత్సరం హరితహారం పథకం కింద 254 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ హరిత నిధి ఏర్పాటుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరిత నిధి ద్వారా ఇప్పటి వరకు రూ.64.80 లక్షలకు పైగా వసూలు కాబడ్డాయి. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, కార్పొరేషన్‌లతో సహా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర సంస్థల ఉద్యోగులు ఈ నిధికి సహకరిస్తారు.అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి తెలంగాణ గ్రీన్ ఫండ్ కంట్రిబ్యూషన్‌ను మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వచ్చే నెల జూన్ 3 నుండి రాష్ట్ర ప్రభుత్వం నాల్గవ దశ పట్టాణ మరియు పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించడంతో, పట్టణ స్థానిక సంస్థలలో (ULBs) పచ్చదనం, పారిశుధ్యం మరియు ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారించింది.

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం 350 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని యుఎల్‌బిలలో పట్టణ ప్రకృతి వనాల (ట్రీ పార్కులు) అభివృద్ధిపై కూడా దృష్టి కేంద్రీకరించబడింది. ఇప్పటి వరకు, 1,852 పట్టణ ప్రకృతి వనాలను (పిపివి) అభివృద్ధి చేశారు మరియు 2022-23లో రాష్ట్రవ్యాప్తంగా 528 పిపివిలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి.ఈ కార్యక్రమం కింద 122 స్థలాలను గుర్తించి ఇప్పటి వరకు 77 సైట్లలో 7.76 లక్షల మొక్కలు నాటారు.

తెలంగాణ హరిత నిధి' (గ్రీన్ ఫండ్)కి సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకి వచ్చి సహకరించడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.2015 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు 'హరిత హారం'ని ప్రారంభించారు.

మరిన్ని చదవండి.

దళిత బంధు పథకం కింద లబ్ది పొందనున్న 1.75 లక్షల కుటుంబాలు!

రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు...వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్!

Related Topics

harithaharam telangana

Share your comments

Subscribe Magazine