News

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. చెరుకు సాగు రైతులకు ఊరట...!

KJ Staff
KJ Staff

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్య వాణిజ్య పంట అయిన చెరుకును ఖరీఫ్, రబీ సీజన్ లలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో సాగుచేస్తూ దాదాపు 160 లక్షల టన్నుల చెరుకు దిగుబడిని సాధిస్తున్నారు. అయితే ప్రతి ఏటా పెరుగుతున్న విత్తన,పురుగుమందులు కూలీల ఖర్చులు రైతులకు ఆర్థిక భారంగా మారుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధరను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో చెరకు మద్దతు ధర పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఏడాది చక్కెర సీజన్ కోసం చెరకు మద్దతు ధరను క్వింటాల్ కు రూ.290కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆమోద ముద్ర వేసింది. సీసీఈఏ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు10 శాతం రికవరీ ఆధారంగా చెరకుపై ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ధర క్వింటాలుకు రూ.90కి పెంచాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎఫ్ఆర్పిని ప్రకటిస్తుంది.రికవరీ 9.5 శాతం కంటే తక్కువగా ఉంటే క్వింటాల్ కు రూ.75.50 లభిస్తుందని గోయల్ అన్నారు. కాగా ఇంతకుముందు చెరకు ఎఫ్ఆర్పీ క్వింటాలు రూ.285 ఉండేది. ఇప్పుడది క్వింటాలుకి రూ.5 పెరిగింది. చెరకు సాగుదారు లకు షుగర్మిల్లులు ఈ కనీస ధర తప్ప నిసరిగా చెల్లించాలని ఈ సమావేశంలో ఆయన తెలియజేశారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.91వేల కోట్లు విలువచేసే 2,976 లక్షల టన్నుల చెరకును రైతుల నుంచి షుగర్ మిల్స్ కొనుగోలు చేశాయి. వీటికి సంబంధించి చెరకు రైతులకు రూ. 91,000 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా, రూ.86వేల కోట్లు ఇప్పటివ రకు చెల్లించామని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

Share your comments

Subscribe Magazine