News

మరో తుఫాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై ప్రభావం చూపనుందా?

Gokavarapu siva
Gokavarapu siva

ఆగ్నేయ అరేబియాలో మరో పెద్ద తుఫాను వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మాల్దీవులకు సమీపంలో ఉంది మరియు సముద్రానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ కారణంగా రానున్న 24గంటల్లో ఈప్రాంతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు ఐఎండీ తెలిపింది.

దీని వల్ల భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. దీని ప్రభావంతో నేటి 5 రోజుల పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్ లో వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా కేరళలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఈ తుఫాన్ వాతావరణం తెలుగు రాష్ట్రాల వైపు కదులుతోందని…తమిళనాడు, కేరళ, కర్నాటకకు దాటుకుని రావడానికి కొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈలోపే మేఘాలు వర్షంగా కురిస్తే తెలుగు రాష్ట్రాల్లో వానలు ఉండవు. ఆ మేఘాలు మనవరకు వస్తే తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి..

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుండి TSRTC బస్సుల్లో ప్రయాణం ఫ్రీ..! రూల్స్ ఇవే

ఈరోజు తెలంగాణా, ఏపీలో వర్షాలు కురవడం లేదు. కానీ ఆకాశంలో ఇంకా చాలా మేఘాలు ఉన్నాయి. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో మేఘాలు ఎక్కువగా కదులుతున్నాయి. బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం కాస్త చల్లబడుతోంది.

రాత్రిపూట తెలంగాణలో 18 డిగ్రీలు, ఏపీలో 22 డిగ్రీలుగా నమోదవుతోంది. పగటిపూట తెలంగాణలో 28 డిగ్రీలు, ఏపీలో 30 డిగ్రీలు ఉంటుంది. ఏపీలో తీర ప్రాంతాల్లో కొంత ఉక్కపోత ఉండేలా ఉంది. అయితే గాలల వల్ల ఆవిధంగా ఉండదు. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి బాగా పెరుగుతోంది.

ఇది కూడా చదవండి..

మహిళలకు గుడ్ న్యూస్.. నేటి నుండి TSRTC బస్సుల్లో ప్రయాణం ఫ్రీ..! రూల్స్ ఇవే

Related Topics

cyclone ap telangana imd alert

Share your comments

Subscribe Magazine