News

Tips To overcome summer Heat: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఈ చిట్కాలు!

Srikanth B
Srikanth B

Tips To Beat summer Heat: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. వేడి కారణంగా బయట తిరగాలన్న జనం భయపడుతున్నారు . ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టాలన్న ఎండా ప్రభావానికి ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు , ఈ వేడి (summer Tips) తాపం నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇక్కడా చూద్దాం.

Tips To overcome summer Heat: సూర్యకాంతి తలపై పడకుండా చూసుకోండి

మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు బలమైన సూర్యకాంతి నుండి నోరు, తలను రక్షించుకోవాలి. ఎందుకంటే సూర్యుడు మీ నోటి మరియు తలపై పడినప్పుడు, మీరు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ముఖం నల్లగా మారవచ్చు, తివారమైన తల నొప్పి ,డి హైడ్రాషన్ జరగవచ్చు దీని నుంచి రక్షించుకోవడానికి తలపై పడకుండా గొడుగు ను ఉపయోగించండి .

నీరు ఎక్కువగా తాగండి

వేసవిలో మీ శరీరంలో నీటి కొరత మరియు శరీరానికి అవసరమైన లవణాలను చమట రూపం లో కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు నీటిని తాగుతూ , కొబ్బరి బొండాలు ,శీతల పానీయాలు ,జ్యూస్ లను స్వీకరిస్తూ వుండండి .

సౌకర్యవంతమైన బట్టలు ధరించండి

వేసవిలో ఎప్పుడూ కాటన్, సౌకర్యవంతమైన బట్టలను మాత్రమే . పాలిస్టర్ దుస్తులను వాడకండి ,ఏవి మిమ్మల్ని మరింత ఇబ్బందిని కల్గిస్తాయి .

సన్‌స్క్రీన్‌ లోషన్‌నువాడండి

మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్‌ను తప్పనిసరిగా అప్లై చేయండి. తద్వారా మీ చర్మం బలమైన సూర్యకాంతి నుండి రక్షించబడుతుంది. దీని వల్ల మీ చర్మం నల్లగా మారదు , టానింగ్ నుంచి బయటపడవచు .

పండ్ల జ్యూస్ తాగుతూ ఉండండి

ఎండ కాలంలో పండ్ల జ్యూస్ ఎక్కువగా తాగండి. జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తగిన మెుత్తంలో పోషకాలు అందుతాయి. అయితే మీరు వేసవిలో పండ్ల జ్యూస్ తాగితే, శరీరం ఎండా ద్వారా కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు .

ఇది కూడా చదవండి .

Benefits of Mango: వేసవిలో మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

వేకువజామున నీరు తాగటం వలన కలిగే ప్రయోజనాలు,ప్లాస్టిక్ బాటిల్లో నీరు త్రాగితే ఏమవుతుంది?

Share your comments

Subscribe Magazine

More on News

More