News

పొలంలో కోతుల బెడద.రైతు వినూత్న ప్రయోగానికి శ్రీకారం.

S Vinay
S Vinay

రైతులు పంటల్ని పండించడానికి ఎంత కష్టపడుతారో వాటిని కాపాడుకోవడానికి కూడా అంతే శ్రమిస్తారు.పురుగులు,కీటకాలు, మరియు వ్యాధులు ఎంతో పంట నష్టాన్ని కలుగజేస్తాయి. వీటితో పాటు వన్యప్రాణులు వలన కూడా పంటలకు నష్టం వాటిల్లుతుంది. జంతువులు పొలాలపై దాడి చేసి పంటని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి.వీటిని అరికట్టడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అయితే ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి సిద్దిపేటకి చెందిన ఒక రైతు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఈ ప్రయత్నం ప్రత్యేకంగా ఉండబోతుంది.


వన్య ప్రాణుల్లో పంట పొలాలకి ఎక్కువగా హాని చేస్తున్న వాటిలో కోతులు,అడవి పందులు ప్రథమంగా ఉన్నాయి.వీటి బెడద జొన్న,మొక్క జొన్న, కూరగాయలలో అధికంగా ఉంటుంది. సిద్ధిపేటకి చెందిన రైతు భాస్కర్ కి పదెకరాల పొలం ఉంది అందులో మొక్కజొన్న,బీరకాయ మరియు కాకర కాయలను సాగు చేస్తున్నాడు.తన పొలంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అయితే వీటిని అరికట్టేందుకు వ్యవసాయ క్షేత్రంలో పులుల దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసాడు కానీ ఎలాంటి ప్రయోజనం కనపడలేదు.అయితే అతనికి ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది అదే ఎలుగుబంటి.

ఎలుగుబంటి కి కోతులు విపరీతంగా బయపడుతాయి.కోతులను నియంత్రించడానికి ఎలుగుబంటి ఉపయోగపడుతుంది అని గమనించిన రైతు భాస్కర్ రెడ్డి అనుకున్నదే తడవుగా హైదరాబాద్ కి వెళ్లి ఎలుగుబంటి దుస్తులను కొనుగోలు చేసాడు.వీటిని ధరించి ఉదయం, సాయంత్రం వేళల్లో ఎలుగుబంటి వేషధారణతో వ్యవసాయ క్షేత్రంలో తిరగడం వలన కోతిమూకలు బెదిరిపోతున్నాయి. అయితే ఈ ఆలోచన విధానానికి చుట్టుపక్కల వున్నా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేసారు.ఈ ఉపాయం కొత్తగా ఉండటం పక్క గ్రామాల నుంచి పలువురు రైతులు భాస్కర్‌రెడ్డి పొలాన్ని సందర్శిస్తున్నారు. కోతుల బెడదను శాశ్వతంగా నిర్మూలించాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని చదవండి.

ఒక కిలో బియ్యం రూ. 500/- శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, పేపర్లు లేక ఏకంగా పరీక్షలే ఆపేసారు.

మల్లవల్లిలో మెగా ఫుడ్ పార్క్ ద్వారా 260 కోట్ల పెట్టుబడి, సుమారుగా 6000 మందికి ఉపాధి కల్పన

Share your comments

Subscribe Magazine

More on News

More