News

తెలంగాణ TET వాయిదాకు డిమాండ్ !

Srikanth B
Srikanth B

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈనెల 12న నిర్వహించనున్నారు .   ఆదివారం జరగనున్న పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎగ్జామ్ కు సిర్వం సిద్ధం కాగా.. ఎగ్జామ్ ను వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. టెట్ ను వాయిదా వేయాలని ఇప్పటికే కొందరు అభ్యర్థులు ఆందోళన చేయగా.. తాజాగా  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మేరకు స్పందించారు .

ఆదివారం జరగనున్న టెట్ ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. టెట్ ను ఎందుకు వాయిదా వేయాలో కారణాలు చెబుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

టెట్ పరీక్ష జరగనున్న జూన్ 12నే రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఎగ్జామ్ జరగనుంది. టెట్ రాసే అభ్యర్థుల్లో చాలా మంది RRB పరీక్షకు కూడా అప్లయ్ చేశారు. రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతుండటంతో సమస్యగా మారింది. రెండింటిలో ఏదో ఒకటే రాసే అవకాశం ఉంది. రెండు పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థులు ఏది రాయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

అందుకే టెట్ ను వాయిదా వేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇదే విషయం చెబుతూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారని.. టెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పరీక్షని రేవంత్ రెడ్డి చెప్పారు. జాతీయ స్థాయి పరీక్షను ఆపేయం వీలు కాదు కాబట్టి.. రాష్ట్ర స్థాయిలో జరిగే టెట్ ను వాయిదా వేయాలని అయన డిమాండ్ చేశారు. టెట్ ను మరోరోజు నిర్వహించాలని సూచించారు.

త్వరలోనే తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 10,028 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్!

Share your comments

Subscribe Magazine