News

త్వరలోనే తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 10,028 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్!

S Vinay
S Vinay

Telangana: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 10,028 పోస్టులను భర్తీ చేయడానికి కి రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

మొదటి దశలో, ఆరోగ్య శాఖలో 1,326 వైద్యుల పోస్టులను రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నసుమారు 12,755 పోస్టులను భర్తీకి నియామకాలను చేపట్టనుంది.వీటిలో TS మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 10,028 పోస్టుల నియామకాన్ని చేపట్టనుంది. ఆరోగ్య రంగంలోని వివిధ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి TS మెడికల్ బోర్డు వారానికోసారి నోటిఫికేషన్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం.ఆరోగ్య శాఖలో ల్యాబ్ అసిస్టెంట్లు, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్లు వంటి టెక్నికల్ పోస్టులను మాత్రం TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు.

మొదటి దశలో, ఆరోగ్య శాఖలో 1,326 పోస్టులను రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది. రిక్రూట్‌మెంట్ సమయంలో, కోవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట సమయంలో తమ సేవలను అందించిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 20 శాతం వెయిటేజీ అందించనున్నట్లు గతంలోనే ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు టి హరీష్ రావు తెలిపారు.

ఈ నియామకాల్లో ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా మరియు అన్ని రిజర్వేషన్ నియమాలను పాటించేలా చూస్తామని,రాష్ట్ర ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా రాష్ట్ర మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. కొత్తగా రిక్రూట్ అయ్యే పోస్టులకు ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తీసుకువస్తాం’’ అని హరీశ్ రావు చెప్పారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, సూపర్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, నర్సులు మరియు MPHA (మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు) పోస్టులను అంతే కాకుండా ఆయుష్ విభాగంలోని నర్సుల పోస్టులను కూడా TSPSC కాకుండా TS మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని చదవండి.

Big update:ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లో 8081 పైగా ఉద్యోగ ఖాళీలు...పూర్తి వివరాలు చదవండి!

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీలు....₹2,40,000 వరకు జీతం పొందండి!

Share your comments

Subscribe Magazine