UPSC:హాపూర్‌కి చెందిన శివంగి UPSCలో 177వ ర్యాంక్ సాధించింది, అత్తమామల వేధింపులు తట్టుకొని తాను ఈ ఘనత సాధించడం గమనార్హం.
యుపి లోని హాపూర్‌లోని పిల్ఖువా నివాసి అయిన శివంగి గోయల్, యుపిఎస్‌సి (UPSC) పరీక్షలో 177వ ర్యాంక్ సాధించడం ద్వారా తన తన కుటుంబంలో ఆనందాన్ని తెచ్చిపెట్టింది.ఆమె తండ్రి రాజేష్ గోయల్ ఒక వ్యాపారవేత్త అవగా తల్లి సాధారణ గృహిణి. అభినందనలు తెలియజేయడానికి వచ్చిన జనంతో ఆమె ఇల్లు కిక్కిరిసి పోయింది. శివంగి తన విజయానికి తన తల్లిదండ్రులకు మరియు తన 7 ఏళ్ల కుమార్తె రైనా అగర్వాల్‌కు క్రెడిట్‌ని ఇచ్చింది.
శివంగి మాట్లాడుతూ, నేను ఇంతకుముందే రెండుసార్లు IAS పరీక్ష రాసాను కానీ అందులో నేను ఎంపిక కాలేదు. ఆ తర్వాత నాకు పెళ్లయింది. మా అత్తమామల ఇంట్లో నన్ను చాలా వేధించారు, చాలా గృహ హింసకి గురైయ్యాను, అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మా అమ్మనాన్న తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.
UPSC:మా నాన్న నాలో మనో దైర్యం నింపాడు. నేను మరోసారి IAS అధికారి అవ్వాలని నిర్ణయించుకున్నాను. పగలు మరియు రాత్రి కష్టపడి ఇప్పుడు నేను మూడవ ప్రయత్నంలో ఎంపికయ్యాను, అందులో నాకు 177వ ర్యాంక్ వచ్చింది. నేను UPSC పోటీ పరీక్ష తయారీకి ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని సొంతంగానే ప్రిపేర్ అయ్యానని తెలిపారు.నేను ఐఏఎస్ కావడానికి పూర్తి సహకారం అందించిన నా తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా నా కుమార్తెకు నా విజయ క్రెడిట్‌ను అందించాలనుకుంటున్నాను అని వెల్లడించారు.
మరిన్ని చదవండి.
Share your comments