News

పీఎం కిసాన్ 11వ విడత విడుదల... లబ్ధిదారుల జాబితాలో మీ పేరుని ఇలా తనిఖీ చేయండి!

S Vinay
S Vinay

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రారంభించబడిన కేంద్ర పథకం. ఈరోజు 10 కోట్ల మందికి పైగా రైతులకు ఈ పథకం కింద 11వ విడతను ప్రధాని మోదీ విడుదల చేశారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడతను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (31 మే 2022) విడుదల చేశారు. ప్రధానమంత్రి ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో 'గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ప్రభుత్వ పథకం కింద రైతులందరికీ సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో మొత్తం జమ చేయబడుతుంది.

మీ ఖాతాకు డబ్బు చేరిందో లేదో ఇలా నిర్దారించుకోండి:

PM కిసాన్ ఖాతా స్థితి లేదా లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేయడానికి దిగువ ఇవ్వబడిన దశలను అనుసరించండి;

PM కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి

హోమ్‌పేజీలో మీరు ఫార్మర్స్  కార్నర్ కి (farmer’s corner) కి వెళ్ళండి

మీరు beneficiary list బెనిఫిషరీ లిస్ట్ పై క్లిక్ చేస్తే, కొత్త పేజీ తెరవబడుతుంది

ఇక్కడ రాష్ట్రం, జిల్లా, మరియు గ్రామం పేరును వంటి వివరాలను నమోదు చేయండి

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి

లబ్ధిదారుల పూర్తి జాబితా తెరపై కనిపిస్తుంది. జాబితాలో మీ పేరును తనిఖీ చేయండి.

మరిన్ని చదవండి.

ఐదు అంచెల పద్దతిలో సాగు విధానం!

Share your comments

Subscribe Magazine