గత కొన్ని రోజుల నుండి భీభత్సంగా ఎండలు కాస్తున్నాయి. ఎండ ధాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ తరుణంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ణుడు కరుణించనున్నాడు. రెండు రాష్టాల్లో పలు చోట్ల వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలియపరిచింది.
ఆంధ్ర ప్రదేశ్ లో విభిన్నవాతావరణం ఉండబోతుంది. రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అమరావతి వాతావరణ కేంద్ర రాష్ట్రంలో ఐదు రోజుల పాటు, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు తెలియచేసింది. దక్షిణ కోస్తాఆంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవనుంది. ఈ ఈదురులు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వియ్యనున్నాయి, కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం వడగాల్పులు వీచేందుకు ఆస్కారం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుండి 27 వరకు వర్షాలు కొనసాగే అవకాశం.
మరోవైపు తెలంగాణలోనూ, వర్ష సూచనా కనిపిస్తుంది. అరేబియా సముద్రం నుండి మేఘాలు, తెలంగాణ వైపు రాకపోవడంతో శనివారం ముంబైలో వర్షాలు కురిసాయి. తెలంగాలోను అక్కడక్కడా చిరు జల్లులు కురిసాయి. రానున్న మూడు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు. తెలంగాణ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నిజామాబాద్ లో వడగళ్ల వాన కురిసింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పటికే 12 జిల్లాల్లో ఆరంజ్ అలెర్ట్ మరియు 10 జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
పంట కోత కోస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలి, ఆరబోసుకున్న ధాన్యం వర్షాలకు పడకుండా చర్యలు చేపట్టాలి. పంట కోత పనులు మిగిలి ఉన్న రైతులు వీలైనంత తొందరగా ఈ పనులు ముగించడం మంచిది.
Share your comments