News

యాసంగి :తెలంగాణ లో 53 లక్షల ఎకరాలలో వరి సాగు .. సాగులో టాప్ జిల్లాకు ఇవే!

Srikanth B
Srikanth B
Paddy Cultivation Telangana reached 53 lakh acers
Paddy Cultivation Telangana reached 53 lakh acers


తెలంగాణాలో వరిసాగు రికార్డు స్థాయికి చేరింది గతంలో ఎన్నడూ లేనివిదంగా ఇప్పటికి 53 లక్షల ఎకరాకు సాగు చేరుకుంది , వ్యవసాయ అధికారులు 50 లక్షలకు సాగు చేరుకుంటుందని అంచనాలు వేసినప్పటికీ ఆ అంచనాలను తలక్రిందులుచేస్తూ సాగు ఏకంగా 53 లక్షలకు చేరుకుంది ఇప్పటికి దాదాపు సాగు పూర్తి అయ్యేదశకు చేరుకోవడంతో ఇంకో 2 లక్షల ఎకరాలు పెరిగి 55 లక్షలుగా చేరుకోవచ్చు .

వరిసాగులో ఉమ్మడి నల్గొండ అగ్రగామిగా నిలిచింది , నల్గొండలో 5 . 4 లక్షల ఎకరాలో వరిసాగు జరగగా సూర్యాపేట లో 4 లక్షల ఎకరాలు , యాదాద్రి భువనగిరి 2 లక్షల ఎకరాలు , తరువాతి స్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు నిలిచింది . మహబూబ్ నగర్ జిల్లా లో 3. 9 లక్షల ఎకరాలలో వరిసాగు జరుగగా తరువాతి స్థానంలో సిద్ధిపేటలో 3. 31 లక్షల ఎకరాలలో సాగు జరిగింది .

రైతులకు శుభవార్త.. ఈ తేదీన అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు..

ఇంత ఎక్కువ స్థాయిలో పంటలు పండించడానికి వానాకాలంలో పడిన వర్షాలకు చెరువులు నిడటం అని చెబుతున్నారు. దానితో పాటు రైతులకు ప్రభత్వం 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇవ్వడం మరియు 30 లక్షల వ్యవసాయ బోర్లను రైతులకు అందించడం వలనే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు కూడా రైతులకు నీటి సమస్యను తప్పించాయి. రైతులు కూడా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం సూచించిన పంటలను వేసి అధిక లాభాలను రైతులు పొందారు.

మరోవైపు ఇతర పంటలతో పోలిస్తే వరి పంట పండించడానికి శారీరక శ్రమ తక్కువ .. పంటను వేసి వేరేపనులను చేసుకునే వెసులుబాటు ఉండడంతో రైతులు అధిక మొత్తంలో వరి సాగు చేస్తున్నారు .

రైతులకు శుభవార్త.. ఈ తేదీన అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు..

Related Topics

Growing paddy

Share your comments

Subscribe Magazine