News

మహిళల ఖాతాల్లో నేడే 'వైఎస్సార్‌ సున్నా వడ్డీ' నగదు జమ.!

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి ఈ సమీక్ష సందర్భంగా నేడు పొదుపు సంఘాల మహిళల బ్యాంకు రుణాలకు సంబంధించి వైఎస్సార్‌ సున్నా వడ్డీని అందజేస్తామని తెలిపారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

సాధారణంగా ఈ కార్యక్రమం గత నెల జులై 26వ తేదీన జరగాల్సి ఉంది. కాగా రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల కారణంగా వాయిదా పడింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా నేరుగా వారి అకౌంట్‌లలో జమ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

ప్రారంభమైన వైయస్సార్ చేయూత అప్లికేషన్స్.. వారి ఖాతాల్లో రూ.18,750 జమ.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

గత మూడేళ్లలో ప్రభుత్వం స్థిరంగా నిధులను డిపాజిట్ చేసింది. శ్రద్ధగా రుణాలు చెల్లించే మహిళలకు వైఎస్ఆర్ జీరో వడ్డీ పథకం కింద రూ.4,969.05 కోట్లు అందజేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పొదుపు సంఘాల మహిళలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు.

ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.

ఇది కూడా చదవండి..

ప్రారంభమైన వైయస్సార్ చేయూత అప్లికేషన్స్.. వారి ఖాతాల్లో రూ.18,750 జమ.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Related Topics

Andhra Pradesh AP CM Jagan

Share your comments

Subscribe Magazine