News

ప్రారంభమైన వైయస్సార్ చేయూత అప్లికేషన్స్.. వారి ఖాతాల్లో రూ.18,750 జమ.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వైయస్సార్ చేయూత పథకం గురించి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. అయితే వైయస్సార్ చేయూత పథకం యొక్క మూడో విడత నగదు వచ్చే సెప్టెంబర్ నెలలో విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం. కాగా ఈ పథకానికి సంబంధించి సచివాలయాల ద్వారా కొత్త అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. కాబట్టి రాష్ట్రంలో ఈ పథకానికి ఎవరైన అర్హులైతే వెంటనే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

SC, ST, BC, మరియు మైనారిటీ కులాలకు చెందిన, అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న మహిళల నుండి ప్రస్తుతం వైయస్సార్ చేయూత 2023- 24 సంవత్సరానికి సంబంధించి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తునట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా 45 నుండి 60 సంవత్సరాల వయస్సు పరిధిలో ఉండాలి. తమ దరఖాస్తులను సమర్పించడానికి, వ్యక్తులు వాలంటీర్‌ను సంప్రదించవచ్చు లేదా సచివాలయానికి కూడా వెళ్ళచ్చు.

అర్హులైన వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆదాయం, కుల దృవీకరణ పత్రాలు అప్లై చేసుకుని సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. అయితే పాత లబ్ధిదారులకు గతంలో సచివాలయాల ద్వారా జారీ చేయబడినటువంటి సర్టిఫికెట్లు ఉంటే సరిపోతుంది లేదా రీ ఇష్యూచేయబడిన సర్టిఫికెట్లు కూడా సరిపోతాయి. కొత్తగా ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి..

ఈ నెల 12 వరకు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల స్వీకరణ ..

ఈ పథకానికి అర్హులైన వారికి ప్రభుత్వం మొత్తానికి రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. కానీ మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని ఒకేసారి ఖాతాల్లో జమ చేయకుండా, ప్రతి ఏడాది అర్హులైన వారికీ 18,750 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇప్పటికే మూడు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో విడత డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

వైయస్సార్ చేయూత పథకం పత్రాలు

దరఖాస్తు ఫారం.

కుల ధృవీకరణ పత్రం

ఆదాయ ధృవీకరణ పత్రం

ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్

ఎలక్ట్రిసిటీ బిల్లు

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్

రేషన్ కార్డు

ఇది కూడా చదవండి..

ఈ నెల 12 వరకు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల స్వీకరణ ..

Related Topics

ysr cheyutha applications

Share your comments

Subscribe Magazine