Agripedia

కాకరకాయ లో లాభ సాటిగా సాగు పద్ధతులు తెలుసుకోండి:

Srikanth B
Srikanth B

రుచి కొంచెం చేదుగా వుండే కాకరకాయ మన ఆరోగ్యానికి చేసే మేలు వెలకట్టలేనిది, ఇందులో చాలా పోషక విలువలు కలవు. ముఖ్యంగ కాల్షియమ్, ఐరన్,పిండి పదార్థాలు,ఖనిజ లవణాలతో పాటు చాలా విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి . మార్కెట్లో మంచి గిరాకీ వున్నా కాకరకాయ కి సంబందించిన సాగు పద్ధతులు తెలుసుకుందాం.

అనువైన నేలలు:
ఎర్ర నేలలు ,ఒండ్రు నేలలు మరియు కర్బన పదార్థం ఎక్కువగా ఉన్న తేలికపాటి బంక మట్టి నేలల్లో కాకరకాయ దిగుబడి అధికంగా ఉంటుంది.

కావాల్సిన ఉష్ణోగ్రత : 25 నుండి 30 డిగ్రీల సెలిసిస్ చాలా అనువైనది

అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు:
ఆర్కా హరిత్ , పూస హైబ్రిడ్ 1, పూస విశేష్ , co 1, కోయింబత్తూర్ లాంగ్ గ్రీన్, జగిత్యాల లాంగ్

విత్తన మోతాదు: ఒక హెక్టర్ కి 2 నుండి 2.5 కిలోలు.

విత్తన శుద్ధి:
ఒక కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ ని కలుపుకొని విత్తన శుద్ధి చేసి విత్తనం ద్వారా వ్యాపించే వ్యాధులను నిర్మూలించవచ్చు.

విత్తే సమయం: వర్షాకాలం పంటలో జూన్ నెలలో మరియు వేసవి కాలం పంటలో డిసెంబర్ నెలలో విధానాలను పొలం లో వేసుకోవాలి.

నీటి పారుదల:
విత్తనాలను చల్లుకునే ముందు ఒకసారి నీటిని పారించాలి ఆ తరువాత మొలకెత్తే వరకు ప్రతి 3 రోజులకి ఒకసారి నీటిని అందివ్వాలి మొలకెత్తిన తర్వాత వారానికి ఒకసారి సరిపోతుంది.

ఎరువుల యాజమాన్యం:
జీవన ఎరువులు వాడటానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి, అజోస్పిరిల్లం మరియు ఫాస్ఫోబ్యాక్తీరియా వంటివి పశువుల ఎరువులతో కలిపి వేసుకోవాలి. కాకరలో అధిక దిగుబడికి ఒక ఎకరానికి 8 కిలోల నత్రజని ,32 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పోటాష్ అవసరం.

కలుపు మొక్కల నివారణ:
కలుపు మొక్కల నివారణకై బూటాక్లొర్ లేక అల్లాక్లొర్ ని పిచికారి చేసుకోవాలి.

కాకరలో పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది దీని నివారణకై పుష్పించే సమయంలో 0.05% మలాథియాన్ లేదా 0.2% కార్బరిల్‌తో పిచికారీ చేయాలి. బూజు తెగులు నివారణకై వ్యాధి కనిపించిన వెంటనే కార్బండజిమ్ (1మి.లీ./లీటరు నీటికి) లేదా కరాథేన్ (0.5 మి.లీ./లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.


మరిన్ని చదవండి

మన ఇంటి దగ్గరే చెఱుకుని సులభంగా పెంచుకుందాం

మామిడి పిందెలు రాలకుండా నిర్మూలన చర్యలు



Share your comments

Subscribe Magazine