Agripedia

జామ తోటల సాగులో అధిక కాయ దిగుబడి , మేలైన యాజమాన్య పద్ధతులు...!

KJ Staff
KJ Staff

మన రాష్ట్రంలో పండే ఉద్యాన తోటల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు ఉద్యాన పంటలైన అరటి,జామ, దానిమ్మ, బొప్పాయి, బత్తాయి, నిమ్మ వంటి పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. ముఖ్యంగా జామ తోటల సాగు విషయానికొస్తే ఒకప్పుడు పెరటి మొక్కగా పెంచబడుతు ప్రస్తుతం వాణిజ్య సరళిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు.

జామ సాగులో సరైన యాజమాన్య , సస్యరక్షణ చేపట్టినట్లయితే సకాలంలో పూత ,కాయలు ఏర్పడి అధిక దిగుబడులు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి.ముఖ్యంగా ప్రతి సంవత్సరం కాయకోత తర్వాత కావునిచ్చిన కొమ్మలను నాల్గింట మూడు వంతు కత్తిరించాలి.ఇలా చేయడం వలన ప్రక్కకొమ్మలు ఎక్కువ వచ్చి అధిక కాయ, పూత పొందడానికి అవకాశం ఉంటుంది.

సాధారణంగా జామలో చలికాలంలో వచ్చే కాయలు మంచి నాణ్యతతో ఉండి, మంచి ధర పలుకుతుంది. కావున వర్షాకాలంలో వచ్చే పంటను నియంత్రించడం వల్ల చలికాలంలో ఎక్కువ కాయలు కాపుకు వచ్చేటట్లు
చేయవచ్చును. దీని కొరకు ఏప్రిల్ ,మే నెలల్లో
నీటి తడులు తగ్గించి చెట్ల ఆకులు రాల్చేటట్లు చేయాలి.తర్వాత జూన్ నెలలో పాదులు తీసి ఎరువులు వేసి నీరు కట్టాలి.4 నుండి 10 సంవత్సరాలవయస్సు ఉన్న ఒక్కో చెట్టుకి 80 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేపపిండి, 650గ్రా.యూరియా, 750గ్రా. ఎస్ఎస్పి, 300 గ్రా, మ్యారేజ్ ఆఫ్ ఫొటోస్ ఎరువులను జూన్ నెలలో ఒకసారి, సెప్టెంబరు నెలలో రెండోసారి పాదుల్లో వేసుకోవాలి.

10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న చెట్లు అయితే ఒక్కో చెట్టుకి 200 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 1.3 గ్రా.యూరియా, 1.5 గ్రా. ఎస్ఎస్పి, 700 గ్రా, మ్యారేజ్ ఆఫ్ ఫొటోస్ ఎరువులను ఇదే మోతాదు రెండు దశల్లో వేసుకోవాలి. సాధారణంగా మొక్కల్లో జింకు లోపం వలన ఆకుల ఈనెలమధ్య పత్రహరితం కోల్పోయి ఆకులపరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అదే విధంగా మెగ్నీషియం లోపము వల్ల తొలిదశలో ఆకురంగు కోల్పోయి పాలిపోతాయి. దీని నివారణకు 2 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

Share your comments

Subscribe Magazine