Agripedia

బెండ సాగు రైతులను అధికంగా నష్టపరిచే తెగుళ్లు నివారణ చర్యలు..!

KJ Staff
KJ Staff

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తున్న కూరగాయల సాగులో బెండకు ప్రత్యేక స్థానం కలదు. దేశవ్యాప్తంగా బెండకాయకు మార్కెట్లో స్థిరమైన రేటు లభిస్తుండడంతో రైతులు అధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు.ముఖ్యంగా బెండ సాగులో తెగుళ్ళ ఉధృతి అధికంగా ఉంటుంది. సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చు.

తెగుళ్లు నివారణ చర్యలు:

ఆకుముడత తెగులు: ఈ తెగులు సోకిన మొక్క ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పైకి మరియు క్రిందకి ముడుచుకొని ఉంటాయి.నివారణకు ఎసిఫేట్ 1గ్రా./లీ.లేదా డైక్లోరోవాస్ 2 మి.లీ./లీ. కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

బూడిద తెగులు : తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణంలో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.ఈ తెగులు సోకితే మొక్కల ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ, డైనోకాప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి.

పల్లాకు తెగులు లేదా శంఖు తెగులు : బెండ సాగులో రైతులను ఆర్థికంగా నష్టపోతుంది.
ఈ తెగులుసోకితే ఆకుల, ఈనెలు పసుపు రంగుకి మారి, కాయలు గిడసబారి, తెల్లగా మారిపోతాయి. దీని నివారణకు క్లోరోథలానిల్ 2.5 గ్రా./లీ.లేదా మాంకోజెబ్ 2.5గ్రా./ లీ. కలుపుకొని పిచికారి చేయాలి.

ఎండు తెగులు : మొక్కల లేత దశలో ఎండిపోయి చనిపోతాయి. మొదట దీని నివారణకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 100కిలో వేపపిండిని వేసుకోవాలి. అలాగే మొక్కల మొదళ్ళ వద్ద కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పోసుకోవాలి.

Share your comments

Subscribe Magazine