Agripedia

వర్షాకాల పంటలకు (ఖరీఫ్) కనీస మద్దతు ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వం!

Srikanth B
Srikanth B

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు శుభవార్త అందించింది. 2022-23 ఖరీఫ్ పంటలకు నూతనంగా కనీస మద్దతు ధరను ప్రకటించింది. పూర్తి వివరాలు చదవండి.

2022-23 సంవత్సరంలో నువ్వులు, టమోటా, వరి, మొక్కజొన్న, మినుము, పత్తి మరియు వేరుశెనగతో సహా మొత్తం 14 పంటలకి గాను కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ వరికి మద్దతు ధర గతేడాది క్వింటాల్‌కు
ఉన్న రూ.1,940 నుంచి రూ.2,040కి పెంచారు.

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2022-23 కోసం కేంద్రం కనీస మద్దతు ధరలను (minimum support price) ఆమోదించిందని కేంద్ర మంత్రి తెలిపారు. భారత్ ఆహార దాన్యాలకై దిగుమతులపై ఆధారపడటం తగ్గిందని ,రైతు ఆదాయం పెరిగిందని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో మొక్కజొన్న పై ₹92. వేరుశనగ ₹300, పొద్దుతిరుగుడు ₹385, నువ్వులు ₹523. వరికి ₹100 లు, జొన్న ₹232 లు, మినుము ₹201 లు. మద్దతు ధర పెంచాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశం అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ 14 పంటలలో అత్యధికంగా నువ్వులకు గాను కనీస మద్దతు ధర ₹523 పెరిగింది.

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరని నిర్ణయించే ముందు సాగుకి అయ్యే ఖర్చుకి కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండేలా నిర్ధారిస్తారు.

వర్షాకాల పంటల కనీస మద్దతు ధర వివరాలు:
వరి (సాధారణ ) 2040

వరి (A గ్రేడ్) 2060

మొక్కజొన్న 1962

వేరు శనగ 5850

మినుములు 6600

పెసర 7755

పొద్దుతిరుగుడు 6400

పత్తి (medium staple) 6080

పత్తి (long staple) 6380

నువ్వులు 7830

జొన్న (హైబ్రిడ్) 2970

జొన్న (మల్దండి) 2990

సోయాబీన్ 4300

కుసుమ 7287

మరిన్ని చదవండి.

నేల, విత్తనం నీరు తో పాటు వ్యవసాయానికి తేనెటీగలు చాలా ముఖ్యమైనవి

Share your comments

Subscribe Magazine