Agripedia

కృషి జాగరణ్ తో రైతు సమస్యలపై చర్చలు జరిపిన కోరమాండల్ ముఖ్య అధికారి సతీష్ తివారీ!

S Vinay
S Vinay

కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భారతదేశంలోని అగ్రగామి కంపెనీలలో ఒకటి . భారతదేశంలో ఎరువుల ఉత్పత్తిలో
ఇది అగ్ర స్థానంలో స్థానంలో ఉంది. ఎరువుల ఉత్పత్తులే కాకుండా కాకుండా వ్యవసాయ పురుగు మందుల ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది.ఇది భారతదేశంలోని తెలంగాణాలోని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది.

ఢిల్లీలోని కృషి జాగరణ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కేజే చౌపాల్ కార్యక్రమానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ మరియు మార్కెటింగ్ హెడ్ సతీష్ తివారీ కృషి జాగరణ్ కార్యాలయాన్ని సందర్శించారు. కృషి జాగరణ్ టీమ్ చప్పట్లతో సతీష్ తివారీకి స్వాగతం పలికింది. వ్యవసాయ రంగంలో మరియు రైతు సంఘంలో ప్రస్తుత సమస్యలను చర్చించడానికి కృషి జాగరణ్ సతీష్ తివారీ గారిని ఆహ్వానించింది.

సతీష్ తివారీని స్వాగతిస్తూ, కృషి జాగరణ్ ఎడిటర్-ఇన్-చీఫ్ MC డొమినిక్, సతీష్ తివారీతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తూ మాట్లాడారు. కోరమాండల్ గ్రూప్ వారి అలుపెరగని నిరంతర మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సతీష్ తివారీ మాట్లాడుతూ భారతదేశంలో సేంద్రీయ ఎరువుల విక్రయదారులలో కోరమాండల్ ఒకటని అన్నారు.కంపెనీ 17 వ్యవసాయ ఉత్పత్తులను కలిగి ఉందని , ప్రస్తుతంకోరమాండల్ నీటిలో కరిగే ఎరువులు మరియు త్వరలో ప్రారంభించబడే పంటల రక్షణ ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.

కోరమాండల్ రైతు సమాజానికి ఏ విధమైన సేవలు అందిస్తుందని అడిగినప్పుడు, సతీష్ తివారీ మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా అనేక CSR (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కార్యకలాపాలు జరుగుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాల గురించి మాట్లాడినట్లయితే, అకెక్కడి ప్రాంతాల్లో వ్యవసాయ క్లినిక్‌లను ఏర్పాటు చేసాము, ఇక్కడ రైతులు పంటల సంరక్షణ గురించి చర్చించవచ్చు. అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతుల సమస్యలకు ఉచితంగా పరిష్కార మార్గాలు అందివ్వడం జరుగుతుందని ,సుమారుగా 30 లక్షల మంది రైతులకు పంటల సలహాలు, భూసార పరీక్షలతో సహా వ్యవసాయ యాంత్రీకరణ వంటి సేవలను అందిస్తుందని, అంతే కాకుండా కోరమాండల్ అధునాతన వ్యవసాయ పరిశోధన మరియు అభివ్రిద్ది కేంద్రాన్ని కలిగి ఉందని తెలిపారు.

Share your comments

Subscribe Magazine