Agripedia

వ్యవసాయం లో డ్రోనుల కొనుగోలుకై రైతులకు 5 లక్షల వరకు సబ్సిడీ:కేంద్ర వ్యవసాయ మంత్రి

S Vinay
S Vinay

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 'కిసాన్ డ్రోన్‌లను ప్రోత్సహించడం మరియు వాటిని వినియోగించడం లో గల సమస్యలు, సవాళ్ల పై సదస్సును ప్రారంభించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన “కిసాన్ డ్రోన్‌లలో గల సమస్యలు, సవాళ్లు మరియు వాటిని అధిగమించే మార్గాలపై కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రసంగించారు. రైతుల సౌకర్యార్థం డ్రోన్ల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఖర్చును తగ్గించి ఆదాయాన్ని పెంచుతుందని మంత్రి వర్యులు చెప్పారు. కిసాన్ డ్రోన్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎస్సీ-ఎస్టీ, చిన్న, సన్నకారు, మహిళా రైతులకు డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 50% లేదా గరిష్టంగా 5 లక్షల సబ్సిడీ అందిస్తుంది. ఇతర రైతులకు, 40 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడుతుందని మంత్రి తెలిపారు.

పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్‌, పురుగుమందులు, పోషకాల పిచికారీ కోసం 'కిసాన్‌ డ్రోన్‌'ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు.

వ్యవసాయంలో డ్రోన్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరియు ఈ రంగంలోని రైతులకు మరియు ఇతర వాటాదారులకు డ్రోన్ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి, వ్యవసాయ యాంత్రీకరణ ఉప మిషన్ (SUB-MISSION ON AGRICULTURAL MECHANIZATION) కింద డ్రోన్ యొక్క 100% ఖర్చుతో పాటు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ & టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్, కృషి విజ్ఞాన కేంద్రం (KVK) మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా (SAU) రైతుల పొలాలలో డ్రోను ల వినియోగం పై ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది.

డ్రోన్ ప్రదర్శన కోసం ఇప్పటికే గుర్తించిన సంస్థలతో పాటు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఇతర వ్యవసాయ సంస్థలు, వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రైతుల డ్రోన్ ప్రదర్శన కొరకై ఆర్థిక సహాయం కోసం అర్హత జాబితాలో చేర్చబడ్డాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మరియు ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి, వివిధ వ్యవసాయ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మానవ శ్రమను తగ్గించడానికి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక పథకాల ద్వారా సహాయం అందిస్తోంది. విత్తనాలు, ఎరువులు మరియు నీటిపారుదల వంటి ఇన్‌పుట్‌ల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రైతులకు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది.

కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి మాట్లాడుతూ, ఈ కొత్త సాంకేతికత ఎక్కువ మంది రైతులకు చేరువయ్యే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని, ఇది వారికి వ్యవసాయ క్షేత్రం లో సాగు పనులను సులభతరం చేస్తుంది మరియు ఖర్చును తగ్గిస్తుంది మరియు వారి ఆదాయాన్ని పెంచుతుందని అన్నారు.

మరిన్ని చదవండి.

అరటి లో దేశ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన రకాలను తెలుసుకోండి!

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More