Agripedia

పడిపోయిన టమాటా ధర...ఒక బాక్సు ధర ఎంతో తెలుసా !

Srikanth B
Srikanth B
పడిపోయిన టమాటా ధర!
పడిపోయిన టమాటా ధర!

గత కొంతకాలం గ భారీగా పెరిగిన టమాటా ధరలు ఇప్పుడు కొంచం తగ్గుముఖం పట్టాయి.
చిత్తూరు: పుంగనూరు, మదనపల్లె హోల్‌సేల్ మార్కెట్‌లలో 14 కిలోల బాక్సు టమాటా ధర రూ.1000 నుంచి రూ.400కి పడిపోయింది. సమీప మండలాల నుంచి 150 టమాట ట్రక్కులు రెండు మార్కెట్‌లకు చేరుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

పుంగనూరు డివిజన్‌లో 4 వేల హెక్టార్లలో టమాట సాగు చేయగా అందులో 3,500 హెక్టార్లలో పంట కోత దశలో ఉందని, దీంతో మార్కెట్‌లకు సరఫరా పెరిగినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు.

అధిక తేమ మరియు పెరిగిన సరఫరా కారణంగా తక్కువ షెల్ఫ్-లైఫ్ ఫలితంగా, రైతులు మరియు వ్యాపారులు తమ ఉత్పత్తులను చెడిపోకుండా హడావిడిగా విక్రయించడం కనిపించింది. నిల్వ ఉంచిన టమాటా నాసిరకం ధర కూడా అనూహ్యంగా పడిపోయింది. దీంతో టోకు మార్కెట్‌లో స్థానిక రకం టమోటా 40-50 శాతం తక్కువ ధరకు విక్రయించబడింది.

‘‘తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పలమనేరు, మదనపల్లె, పుంగనూరులోని హోల్‌సేల్‌ మార్కెట్‌లను సందర్శించి ప్రతి సీజన్‌లో టమాట కొనుగోలు చేసేవారు. అయితే అక్కడి రైతులను స్థానికంగానే టమాట పండించేలా ప్రోత్సహించడంతో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 14 కిలోల బాక్సు ధర రూ.300కి పడిపోతే రైతులకు ఇక లాభం లేదు' అని పుంగనూరు మార్కెట్‌కు చెందిన వ్యాపారి కె. దామోదర్  తెలిపారు.

వరి సాగులో చేపల పెంపకం...లాభాలు తెలుసుకోండి!

టమాటాలు ఎక్కువ రావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని పుంగనూరు యార్డు అధికారులు తెలిపారు. గత నెలలో డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో పాటు సరఫరా తక్కువగా ఉండడంతో రైతులు  అధిక ధరలను పొందారని అధికారులు తెలిపారు.

రైతులకు శుభవార్త ఇకపై నేరుగా మొబైల్ ఫోన్లకే ఆ వివరాలు!

Share your comments

Subscribe Magazine