Animal Husbandry

నాటు కోళ్ల పెంపకం.... ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువ.

KJ Staff
KJ Staff

పుట్టిన రోజు, పెళ్లి రోజు ఇలా సందర్భం ఏదయినా సరే బంధువులు అందరు ఒక్క కలవాల్సిందే, పొయ్యి మీద కోడి కూర ఉడకాల్సిందే. మన తెలుగు రాష్ట్రాల్లోని కోడి కూరకి ఇక్కడి ప్రజలే కాకుండా, ప్రపంచం అంత అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా నాటు కోడి మాంసానికైతే మాంశ ప్రియుల సంఖ్యకు లెక్కేలేదు. మార్కెట్లో చవకగా దొరికే బ్రాయిలర్ కోళ్లకంటే, నాటు కోడి మాంసానికి గిరాకీ ఎంతో ఎక్కువ. నాటు కోడి గుడ్లకి కూడా గిరాకీ చాల ఎక్కువుగా ఉంటుంది. బాలింతలను, చిన్న పిల్లలను, నాటు కోడి గుడ్లను తినమని వైద్యులు సూచిస్తుంటారు.

నాటు కోళ్ల పెంపకానికి, సాధారణ బ్రాయిలర్ కోళ్ళకన్నా ఎక్కువ సమయం పడుతుంది. కానీ తక్కువ లభ్యత, అధిక మాంశకృతులు, పోషకవిలువలు ఉన్న నాటు కోడి మాంసానికి మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తుంది. నాటు కోడి పెంపకాన్ని అవసరమైన యాజమాన్య పద్ధతుల గురించి చదివి తెలుసుకోండి.

నాటు కోలల్లో రకాలు.

నాటు కోడి రకాల్లో అతి ముఖ్యమైనవి, వానరాజా, గిరి రాజా, రాజశ్రీ, కడకనాథ్, స్వర్ణ దార మరియు సోనాలి రకాలు. ఈ ఆర్టికల్లో సోనాలి బ్రీడ్ కోళ్ల పెంపకం గురించి వివరించడం జరిగింది.

సోనాలి బ్రీడ్ కోళ్ల పెంపకం.

సోనాలి బ్రీడ్ కోడి పెంచడానికి సులువుగా మరియు భిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. మిగిలిన నాటు కోడి రకాలతో పోలిస్తే ఈ రకం కోళ్లు తక్కువ కాలంలోనే పరిపక్వము చెంది మాంసానికి అనువుగా మారతాయి. కోడి వయస్సు ఆరు నెలలకు చేరుకోగానే మార్కెట్లో విక్రయించవచ్చు. ఈ బ్రీడ్ కోడి సుమారు 1-1.5 కేజీల వరకు బరువు పెరుగుతుంది. బ్రాయిలర్ కోళ్ల లాగా నాటుకోళ్లను, పంజరాల్లొ బంధించి పెంచడం అసాధ్యం. కనుక నాటు కోళ్ల పెంపకానికి విశాలమైన స్థలం చాల ముఖ్యం.

సోనాలి బ్రీడ్ కోడి పిల్లలు చాల సున్నితంగా ఉంటాయి కాబట్టి మొదటి నాలుగు వారలు ప్రత్యకంగా ఏర్పాటు చేసిన బ్రూడింగ్ బాక్సుల్లో ఉంచాలి. 250 వాట్స్ బల్బుల సహాయంతో పిల్ల ఎదుగుదలకు అవసరమైన వేడిని అందించవలసి ఉంటుంది. ఆరు వారాల పాటు నీటితో మరియు ఇతర సప్లిమెంట్లను ఫీడర్ల సహాయంతో అందించాలి. ఆరు వారలు దాటిన తర్వాత కోళ్లను పగటి సమయంలో ఆరుబయట తిరగడానికి వదిలిపెట్టాలి. పొలం చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కోళ్లు పొలం సరిహద్దులు ధాటి బయటకి వెళ్లిపోకుండా కాపాడుకోవచ్చు. ఎదిగిన కోళ్లకు సప్లిమెంట్లు అందించవలసిన అవసరం లేదు కాబట్టి సులభంగా దొరికే ధాన్యం, మరియు మొక్క జొన్న గింజలను అందించవచ్చు. కోళ్లకు వచ్చే వైరస్ మరియు ఇతర రోగాల నుండి కాపాడుకోవడానికి సమయానుసారంగా టీకాలను అందించాలి. ఈ పద్ధతులు అన్ని పాటిస్తూ, నాటు కోళ్లను పెంచినట్లయితే ఒక కోడి పరిమాణం బట్టి 400-500 రూ. వరకు పొందవచ్చు. సోనాలి బ్రీడ్ గుడ్లను కూడా ఇతర నాటు కోడి గుడ్లలాగానే లాగానే మార్కెట్లో అధిక ఎక్కువ ధరకు విక్రయించవచ్చు.

Share your comments

Subscribe Magazine