Animal Husbandry

రైతులకు శుభవార్త: ఆర్బీకేల ద్వారా చేప పిల్లల సరఫరా..

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల ఇప్పటికే రైతుల కొరకు విధానాలను మరియు ఎరువులను పంపిణి చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన చేపల సీడ్ సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తుంది.

ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా రైతులకు చేప ,మరియు రొయ్య మేతలను అందిస్తుంది. రాష్ట్రంలో ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లో ఉన్న ఆర్బీకేల్లో ఇప్పటికే 734 మత్స్య సహాయకులు రైతులకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఉన్న విషయం మనకి తెలిసినదే.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన మత్స్య శాఖ రైతులకు దిగుబడులను మరియు వారికి ఆదాయాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్ లో చేపపిల్లలను ఉత్పత్తి చేస్తుంది. దీనికొరకు ప్రభుత్వం కూడా రైతులకు మంచి సీడ్స్ సరఫరా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటుంది.

ఇది కూడా చదవండి..

ఏపీలో 662 స్కూళ్లు పీఎంశ్రీ పాఠశాలలుగా ఎంపిక.. ఆమోదించిన కేంద్ర విద్యాశాఖ

ప్రభుత్వం మత్స్య సహాయకులకు అందించిన ట్యాబ్లో కొత్త అప్లికేషన్ ఇన్స్టాల్ చేసింది. దీనికోసం అని రాష్ట్రంలోని ఆర్బీకేలకు 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్ ని ఈ - మత్స్యకార యాప్ ద్వారా అనుసంధానం చేసింది. రైతులు ఆర్బీకేల్లో బుకింగ్ చేసి రాష్ట్రంలో లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు జిల్లాల వారీగా ప్రభుత్వం అందించనుంది.

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 25 ఫీడ్ కంపెనీలతో ఎంఓయూ సంతకం చేసింది. వీటి నుండి ప్రభుత్వం ఆర్బీకేల్ ద్వారా రైతులకు 2,736 టన్నుల చేప, రొయ్యల మేతను అందించింది. వీటితోపాటు ఆక్వా సాగుకు కావలసిన మిగతా ఇంపుట్స్ ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. రైతులకు దిగుబడులు పెంచేందుకు చెరువుల నుండి సాంపిల్స్ సేకరించి క్వాలిటీ టెస్టులు కూడా జరిపిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ అన్ని లైసెన్స్డ్ రిజర్వాయర్లకు సీడ్స్ సరఫరా చేయడానికి 10.10 కోట్ల సీడ్ అవసరమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని లైసెన్స్డ్ రిజర్వాయర్లకు ఆర్బీకేల ద్వారా 3.09 కోట్ల ఫిష్ సీడ్స్ సరఫరా చేసింది.

ఇది కూడా చదవండి..

ఏపీలో 662 స్కూళ్లు పీఎంశ్రీ పాఠశాలలుగా ఎంపిక.. ఆమోదించిన కేంద్ర విద్యాశాఖ

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More