భారత దేశం పాల ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో ఉంది. మనం అనేక దేశీయ ఆవులను కైలిగి ఉన్నాం వాటిలో ముఖ్యంగా ఒంగోలు, పోడ తూర్పు,గిర్,రెడ్ సింధి, సహివాల్ వంటి పాలిచ్చే ఆవులు ఉన్నాయి.
ప్రస్తుతం దేశీయ ఆవులు సగటున రోజుకి 6 నుండి 8 లీటర్ల పాలను ఇస్తున్నాయి, అయితే వీటి అన్నింటిని సవాలు చేస్తూ (HARDHENU COW) హర్ధేను ఆవు 55 నుండి 60 లీటర్ల పాలను అందిస్తుంది. ఇది ఖచ్చితంగా పాడి పరిశ్రమ రైతులకి శుభవార్త అని చెప్పుకోవాలి.
హర్ధేను ఆవు (HARDHENU COW) అసలు ఎక్కడ పుట్టింది?
హర్యానాలోని లాలా లజపత్ రాయ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు హర్ధేను జాతి ఆవును ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఇది మూడు జాతుల కలిపి ఈ ఆవును తయారు చేసారు, హాలాండ్ కి చెందిన హోల్‌స్టెయిన్ ఫ్రిజెన్, స్వదేశీ హర్యానా మరియు సహివాల్ అనే మూడు జాతులను కలిపి క్రాస్ బ్రీడ్ పద్దతి ద్వారా ఈ ఆవుని అభివృద్ధి చేసారు.
హర్ధేను ఆవు (HARDHENU COW) ముఖ్య లక్షణాలు:
హర్ధేను జాతి ఆవు గురించి ప్రత్యేకత గురించి చెప్పాలంటే ,ఇతర జాతుల ఆవుల కంటే ఈ జాతికి పాల సామర్థ్యం ఎక్కువ.
హరధేను జాతి ఆవు పాలు ఎక్కువగా తెల్లగా ఉంటాయి .
పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది.
ఇతర జాతులతో పోలిస్తే హరధేను జాతి ఆవులో ఎదుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది.
రైతులు వ్యవసాయం తో పాటు పాడి పరిశ్రమ వైపు కూడా ఆసక్తి ని కనబరుస్తున్నారు. అలంటి వారికి ఇది ఖచ్చితంగా పసిడి ఆవు అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆవుకు మెరుగైన పోషణ, మరి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే రోజుకు సుమారు 55-60 లీటర్ల ఇచ్చే పాల సామర్థ్యం ఈ హర్ధేను ఆవుకి (HARDHENU COW) ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని చదవండి.
Share your comments