Education

AP: టెన్త్ క్లాస్ పూర్తిచేసిన విద్యార్థులకు చక్కటి అవకాశం... ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్......

KJ Staff
KJ Staff

ఆంధ్ర ప్రదేశ్లో 10 వ తరగతి పూర్తయ్యి పరీక్షా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. తర్వాత ఏమిటని విద్యార్థులు, మరియు తల్లితండ్రులు సంకోచంలో ఉంటారు. ఇటువంటివారందరు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీ జీవితానికి ఒక బంగారు బాట వేసుకోగలరు

ఎంతోమంది ఇంజనీరింగ్ వృత్తివిద్యా కోర్సులకు ఇప్పటినుండే తయారుకావడం ప్రారంభించి ఉంటారు. వీరందరూ ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా వారు అనుకున్న లక్ష్యం వైపు చేరుకోగలరు. ఆర్జియుకేటి ఏపీ, ఆంధ్ర ప్రదేశ లోని ట్రిపుల్ ఐటీ కళాశాల్లో2024-25 సంవత్సరానికి గాను ప్రవేశాలకు తొందర్లోనే నోటిఫికేషన్ విడుదల చెయ్యనుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లు ఉన్నాయి వీటిని, రాజీవ్ గాంధీ విజ్ఞాన్ సాంకేతిక విశ్వవిద్యాలయం(RGUKT) నిర్వహిస్తుంది. ఈ యూనివర్సిటీలు నూజివీడు, శ్రీకాకుళం, ఆర్క్ వ్యాలీ, ఒంగోలు క్యాంపస్ లుగ ప్రాచుర్యం పొందాయి. వీటిలో చదివే విద్యార్థులకు రెండేళ్ల పియూసి తో పాటు, నాలుగు సంవత్సరాల బీటెక్ ఇంటిగ్రేటెడ్ గా బోధిస్తారు, విద్యార్థులకు దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎటువంటి చింత లేకుండా ఒకేచోట ఇంటర్మీడియట్ తో పాటు బిటెక్ కూడా పూర్తిచేసుకుని అవకాశం.

ఆంధ్ర ప్రదేశ్ ట్రిపుల్ ఐటీ లో ప్రవేశాల కొరకు ఈ నెల 8 వ తారీఖున ఉదయం 11 గంటల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఏడాది వీలైనంత తొందరగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించి, జులై నాటికి తరగతులు ప్రారంభించాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు https://www.rgukt.in/ పూర్తి వివరాల కోసం సమాచారం పొందవచ్చు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో 4,400 సీట్లు భర్తీ చేస్తారు.

ట్రిపుల్ ఐటీ కళాశాలలో దరఖాస్తు కొరకు, అబ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డ్ నుండి పదో తరగతి పాసై ఉండాలి. ప్రైవేట్ స్కూల్ లో చదివిన విద్యార్థుల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రధాన్యత ఇస్తారు. సీట్ల కేటాయింపులో ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు 85% వాటా కల్పిస్తారు, మిగిలిన 15% సీట్ల కొరకు తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Education

More