Education

Telangana Intermediate Results 2024: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల విడుదలకు తేదీ ఖరారు ...

KJ Staff
KJ Staff

తెలంగాణ లో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యి దాదాపు నెల రోజులు అవుతుంది. పరీక్షఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, విద్యాశాఖ శుభవార్త అందించింది.....

తెలంగాణాలో ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. విద్య శాఖ ఈ పరీక్షా వివరాలను ఈ నెల 24, ఉదయం 11 గంటలకు వెల్లడించనుంది.

పరీక్ష పాత్రల మూల్యాంకన ముందుగానే పూర్తయిన, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు జవాబు పాత్రలను మూడు సార్లు పరిశీలించారు. దీనికి సంబంధించిన కోడింగ్, డీకోడింగ్, ప్రక్రియ పూర్తయ్యింది. గత సంవత్సరం మే 9 న పరీక్ష ఫలితాలు వెల్లడించగా, ఈ ఏడాది 15 రోజుల ముందే ఫలితాలు విడుదల చెయ్యడం గమనార్హం. మరోవైపు 10 వ తరగతి ఫలితాలు కూడా విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది.

రాష్ట్రంలో మార్చ్ 18 నుండి, ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. 10 వ తరగతి పరీక్షా పాత్రల మూల్యాంకన శనివారం పూర్తయ్యింది, రానున్న వారం రోజుల్లో ఆన్లైన్లో పరీక్ష ఫలితాలను నమోదుచేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈ నెల 30 లేదా మే మొదటి వారంలో పరీక్ష ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.

పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు ఎన్నికల సంగం ఆమోదం తెలిపింది. అయితే దేశంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విద్యాశాఖ మంత్రి కాకుండా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఫలితాలను విడుదల చెయ్యనున్నారు.

Share your comments

Subscribe Magazine