జనవరి 22న ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన APSRB బోర్డు కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది , విడుదల చేసిన ఫలితాలలో కేవలం 95,208 మాత్రమే అర్హత సాధించారు .
ఆంధ్రప్రదేల్ 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా..
మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 4,58,219 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో కేవలం 95,208 మంది మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత సాధించారు. వీరికి ఈవెంట్స్ నిర్వహించి.. అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. జనవరి 22న ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSRB). రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి సంచలనం సృష్టించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
తెలంగాణాలో 1553 లైన్‌మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..
మొత్తం 200 మార్కులకు ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించగా.. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్ కు 30 శాతం (60 మార్కులు), బీసీ అభ్యర్థులకు 35 శాతం (70 మార్కులు), ఓసీ అభ్యర్థులకు 40 శాతం (80 మార్కులు) అర్హతగా నిర్ణయించి ఫలితాలను విడుదల చేశారు.
Share your comments