andhra pradesh:ఇంటర్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆతురుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్(eamcet) పరీక్ష తేదీలు ఎట్టకేలకు వచ్చాయి. JNTU అనంతపురం AP EAMCET 2022 పరీక్ష తేదీని విడుదల చేసింది. AP EAMCET రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.
AP EAMCET 2022: ఎంసెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మే 10, 2022. ఒక వేళ ఎవరైనా విద్యార్ధి ఈ గడువులోపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎడల,రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 22, 2022 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.అలాగే అప్లికేషన్ ఫారంలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఫారమ్ కరెక్షన్ విండో జూన్ 23 నుండి 26 మధ్య అందుబాటులో ఉంటుంది.
AP EAMCET 2022: అడ్మిట్ కార్డ్ జూన్ 27న విడుదల చేయబడుతుంది.ఇంజనీరింగ్ పరీక్ష జూలై 4 నుండి జూలై 8 వరకు నిర్వహించబడుతుంది. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు జూలై 11 మరియు 12 తేదీల్లో నిర్వహించబడతాయి.
పూర్తి వివరాలు:
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా) - మే 10, 2022
EAPCET దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ (ఆలస్య రుసుము రూ. 500తో) - జూన్ 20, 2022
అడ్మిట్ కార్డ్ విడుదల - జూన్ 27, 2022.
AP EAMCET 2022 పరీక్ష తేదీ
ఇంజనీరింగ్: జూలై 4 నుండి జూలై 8, 2022 వరకు
వ్యవసాయం: జూలై 11 మరియు జూలై 12, 2022 వరకు
ఎంసెట్ పరీక్ష చివరి ఫలితాలు ఆగస్టు నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.విద్యార్థులు అధికారక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
అధికారక వెబ్ సైట్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని చదవండి.
SBI Recruitment 2022: నెల వారి జీతం 64,000 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
Share your comments