జవహర్లాల్ నెహ్రు టెక్నికల్ యూనివర్సిటీ(JNTU) కాకినాడ, అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఫార్మా కళాశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి AP EAPCET పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పరీక్ష దరఖాస్తు వివరాల కోసం చివరి వరకు చదివి తెలుసుకోండి.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మా కోర్సులలో ప్రవేశాలకోసం నిర్వహించే EAPCET పరీక్షకు నోటిఫికేషన్ నిన్న విడుదల అయ్యింది. ఈ పరీక్ష కోసం ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు 500 రూ ఫైన్ తో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 1000 రూ ఫైన్ తో మే 5 వరకు, ఐదు వేల ఫైన్ తో మే 10 వరకు, మరియు 10,000 రూ ఫైన్ తో మే 12 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంజనీరింగ్, ఫార్మ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 16 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు అగ్రికల్చర్, బిఎస్సి నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుకు కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ/ఎస్టి/బీసీ కేటగిరీ అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. దరఖాస్తు రుసుము ఓసి క్యాటగిరీ రూ. 1200, బీసీ క్యాటగిరి రూ. 1100 మరియు ఎస్సీ/ ఎస్టి క్యాటగిరీ రూ. 1000 గాను ఉంది . ఈ ఫీజు ఆన్లైన్ లో క్రెడిట్/ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెలించవచ్చు.
ఆన్లైన్ అప్లికేషన్ లో తప్పులు సరిచేసుకునేందుకు మే 4 నుండి మే 6 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. మే 7 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష రాష్ట్రంలోని మొత్తం 47 సెంటర్లలో నిర్వహించనున్నారు. మొదట ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం మే 13 నుండి మే 16 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అగ్రికల్చర్ మరియు ఫార్మా కోర్సులలో ప్రవేశాలకు మే 17 నుండి మే 19 పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు మొత్తం రెండు షిఫ్టులలో జరగనున్నాయి. మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, ఆఫ్టర్ నూన్ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.
ఆన్లైన్ దరకాస్తు కోసం ఇక్కడ ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి https://cets.apsche.ap.gov.in/EAPCET/
మీ డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు helpdeskapeapcet@apsche.org మెయిల్ చేసి నేరుగా సంప్రదించవచ్చు.
Share your comments