ఆంధ్ర 10 వ తరగతి పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆశక్తితో ఎదురుచూస్తున్నారు. పది పరీక్ష ఫలితాలు విడుదలకు అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసారు. ప్రశ్న పాత్రల మూల్యాంకన, ప్రస్తుతం రెవెరిఫికేషన్ జరుగుతున్నట్లు అధికారులు తెలియచేసారు. ఏప్రిల్ నెల చివరి నాటికీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
పరీక్షా ఫలితాలను ఆన్లైన్లో నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 6.3 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే పరీక్షా పాత్రల మూల్యాంకన పూర్తయింది, రెవెరిఫికేషన్ జరిగిన తర్వాత, ఆన్లైన్లో ఫలితాలను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి కనీసం ఒక వరం రోజులు పట్టచ్చని అధికారులు తెలుపుతున్నారు. విద్యార్థులకు మరియు పాఠశాల యాజమాన్యానికి పదవ తరగతి ఫలితాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఇంటర్మీడియట్ మరియు పలు వృత్తి విద్య కోర్సులు, డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు, 10వ తరగతి ఫలితాలను ఆధారంగా చేసుకొని కల్పిస్తారు.
మార్చ్ 18 నుండి 30 వరకు ఆంధ్ర ప్రదేశ్లో ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది ఇంచుమించు ఇదే సమయానికి పరీక్షలు నిర్వహించి మే 6 న ఫలితాలు వెల్లడించారు. కానీ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో, ఫలితాలను ముందుగానే వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 25 లోపు ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏమైనా ఇతర కారణాలు ఉంటె ఫలితాల విడుదల తేదీ మే మొదటి వారానికి పొడిగించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈసీ నుండి ఫలితాలు విడుదలకు అనుమతి లభించినందున వీలైనంత తొందరగా ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు
Share your comments