ఆంధ్ర ప్రదేశ్లోని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో దరఖాస్తుకు గడువును జులై ఆరు వరకు పొడింగించేందుకు యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పాసైన విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం. వృత్తి విద్య కోర్సుల్లో ఉతీర్ణత సాధించాలన్న వారికి హార్టికల్చర్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ డిప్లొమా కోర్సులలో శిక్షణ అందిస్తారు.
2024-25 విద్యా సంవత్సరానికి గాను, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అందిస్తున్న డిప్లొమా కోర్సుల్లో అర్హులైన వారి దగ్గరనుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం మే 22 న నోటిఫికేషన్ విడుదల చేసారు. మే 25 నుండి ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ జూన్ 18 తో ముగిసింది. తల్లితండ్రులు మరియు విద్యార్థులు దరఖాస్తు గడువు పొడిగించాలని కోరడంతో, జులై 6 వరకు ఈ తేదీని పొడిగిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. జులై 6 తరువాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు, కౌన్సిలింగ్ రెండు దశల్లో ఉంటుంది, మొదటి దశలో సీట్ లభించని వారు రెండవ దశలో హాజరుకావచు. వెబ్ ఆప్షన్ల ప్రాధాన్యత మరియు సీట్ల ఖాళీలను బట్టి సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పకుండ 10వ తరగతి పాసై ఉండాలి. 10 వ తరగతి రెగ్యులర్ లేదా సప్లిమెంటరీ లో పాసైన వారు మరియు ఇంటర్మీడియట్ ఫెలైన వారు అర్హులు. అయితే ఇంటర్మీడియట్ పాసైన వారు మాత్రం అనర్హులు. అప్లై చేసే అభ్యర్థుల వయసు 15 ఏళ్ళు పూర్తై ఉండాలి, మరియు 22 ఏళ్ళు దాటకూడదు. ఈ విద్య సంవత్సరానికి మొత్తం సీట్లు ఇలా ఉన్నాయి. డిప్లొమా హార్టికల్చర్ ప్రభుత్వ కాలేజీల్లో 200 సీట్లు అలాగే అనుబంధ కాలేజీల్లో 280 సీట్లు ఉన్నాయి. హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సుల్లో 220 గవర్నమెంట్ సీట్లు, 280 ప్రైవేట్ సీట్లు ఉన్నాయి.
సీట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత గ్రామీణ ప్రాంత విద్యార్థులకే, మొత్తం సీట్లలో 75% రురల్ ప్రాంతాల్లో కనీసం నాలుగు సంవత్సరాలు చదివిన వారికి కేటాయిస్తారు. 25% సీట్లు మునిసిపల్ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. మొత్తం 85% సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయించగా, మిగిలిన 15% అన్ రిజర్వేడ్ మెరిట్ బేస్ మీద కేటాయిస్తారు. ఇంకా రేజర్వేషన్ల గురించి చూస్తే ఓపెన్ కేటగిరిలో 50% సీట్లు, ఎస్సి కేటగిరిలో 15% సీట్లు, ఎస్టి కేటగిరిలో 6% సీట్లు, బీసీ కేటగిరిలో 29% సీట్లు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరిలో దివ్యంగులకు 5% సీట్లు, సైనిక సిబ్బంది పిల్లలకు 2%, ఎస్సిసి లో 1% మరియు స్పోర్ట్స్ కేటగిరిలో 0.5% సీట్లు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారక వెబ్సైటు https://www.drysrhu.ap.gov.in/home.html లోకి వెళ్లిన తరువాత, అక్కడ డిప్లొమా ప్రొగ్రమ్స్ అడ్మిషన్ 2024-25 రిజిస్ట్రేషన్ స్రోల్ అవుతుంది. అక్కడ క్లిక్ ఇయర్ అప్లై అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఆన్‌లైన్ అడ్మిషన్స్ ఇన్‌టూ 2 ఏళ్ల డిప్లొమా హార్టికల్చరల్ కోర్సు -2024-25 అని ఉంటుంది. దానిపై క్లిక్‌చేస్తే, ఎస్ ప్రొసిడ్‌పై క్లిక్ చేయాలి. అలా చేసిన తరువాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సెలక్ట్ బోర్డు బాక్స్‌లో పదో తరగతి చదివిన బోర్డుపై ఎంపిక చేసుకోవాలి దాని పక్క బాక్స్‌లో పదో తరగతి ఎలా పాస్ అయ్యామో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రెగ్యూలర్, లేక సప్లమెంటరీనా ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. తరువాత బాక్స్‌లో పదో తరగతి హాల్ టిక్కెట్టు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ పక్క బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. అలా పూర్తి చేసిన తరువాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఆ వివరాలు ఎంటర్ చేసిన తరువాత, పూర్తి వివరాలు కోరుతూ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాన్ని పూర్తి చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే, అక్కడ బాక్స్‌లో పదో తరగతి హాల్ టిక్కెట్టు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ పక్క బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. అలా పూర్తి చేసిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత పేమెంట్ స్టేటస్‌ను తెలుసుకోవడానికి నౌ యూవర్ పేమెంట్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేస్తే, అక్కడ బాక్స్‌లో పదో తరగతి హాల్ టిక్కెట్టు నెంబర్ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేస్తే, అక్కడ బాక్స్‌లో పదో తరగతి హాల్ టిక్కెట్టు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ పక్క బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. అలా పూర్తి చేసిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ స్టేటస్ వస్తుంది.అప్లికేషన్ ఫీజు ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.400 కాగా, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800 నిర్ణయించారు. ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
Share your comments