Education

డిఫెన్స్‌ మినిస్ట్రీలో ఈ కేంద్ర కొలువులకు దరఖాస్తు చేసుకోండి..

Srikanth B
Srikanth B


భారత ప్రభుత్వ డిఫెన్స్‌ మినిస్ట్రీకి చెందిన ఇండియన్ ఆర్మీ.. నార్తర్న్ కమాండ్‌ ప్రధాన కార్యాలయం
ఫైర్‌మెన్‌, సివిలియన్‌ మోటర్‌ డ్రైవర్‌, వెహికల్‌ మెకానిక్‌, క్లీనర్‌, మజ్దూర్ పోస్టు (Fireman posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 23

పోస్టుల వివరాలు:

సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టులు: 5
వెహికల్ మెకానిక్ పోస్టులు: 1
క్లీనర్ పోస్టులు: 1
ఫైర్‌మ్యాన్ పోస్టులు: 14
మజ్దూర్ పోస్టులు: 2
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 18,000ల నుంచి రూ.45700ల వరకు జీతంగా చెల్లిస్తారు. వీటితోపాటు ఇతర అలవెన్సులను కూడా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పిజికల్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు గానూ 2 గంటల్లో…150 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. క్వశ్చన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

ప్రశ్నల సరళి:

జనరల్‌ ఇంటెలిజెన్స్‌: 25 ప్రశ్నలకు 25 మార్కులు
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: 50 ప్రశ్నలకు 50 మార్కులు
న్యూమరికల్ ఆప్టిట్యూడ్‌: 25 ప్రశ్నలకు 25 మార్కులు
జనరల్‌ అవేర్‌నెస్‌: 50 ప్రశ్నలకు 50 మార్కులు
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Commanding Officer 5171 ASC Bn (MT) PIN:905171 C/O 56 APO

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (ఆగస్టు 22, 2022).

ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన..ఎంసెట్ అగ్రికల్చర్ రీషెడ్యూల్ ఇదే..!

Share your comments

Subscribe Magazine

More on Education

More