Education

APPSC: ఏపీపిఎస్సి కీలక ప్రతిపాదనలు, ప్రక్షాళన, జాబ్ క్యాలెండరు.....

KJ Staff
KJ Staff

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇందులోని అంతర్గత మార్పులకు సిద్దమయ్యింది. ఏపీపిఎస్సిలో కీలకమైన మార్పులు, చైర్మన్ మరియు ఇతర సభ్యుల ఎంపికకు ఎటువంటి అడంకులు లేకుండా ఉండేదుకు కీలకమైన ప్రతిపాదనలు చెయ్యనుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎంతోమంది యువత జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి భరోసా ఇచ్చే విధంగా ఏపీపిఎస్సి, జాబ్ నోటిఫికేషన్ జారీ, ఉద్యోగుల కేటగిరి విభజన, ఇలా పలు అంశాల మీద ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసేందుకు సిద్దమయ్యింది.

గతంలో వైసీపీ ప్రభుత్వం ఏపీపిఎస్సి లో ప్రక్షాళన దిశగా వివిధ శాఖలకు చెందిన 10 మంది నిపుణులతో ఒక కమిటీ వేసింది. ఇప్పుడు ఈ కమిటీ తమ నివేదికను కూటమి ప్రభుత్వానికి అందించనుంది. ఇప్పటివరకు కాబినెట్ ఆమోదించిన ఉద్యోగాల భర్తీకి ఆర్ధిక శాఖ తప్పనిసరిగా ఉండేది, ఇక నుండి ఈ నిబంధనను సడలించనున్నారు. ఏపీపిఎస్సి లో ఉద్యోగులను రాష్ట్ర సివిల్ సర్వీసెస్-ఏ,బి, రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ మరియు టీచింగ్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్ కింద ఉద్యోగాలను విభజిస్తారు.

ఈ కొత్త ప్రతిపాదనల ద్వారా, జాబ్ క్యాలెండరు నుండి మాత్రమే ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు. వివిధ శాఖల్లోని ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు, ప్రభుత్వ శాఖల నుండి ఏపీపిఎస్సి కి వివరాలు అందనున్నాయి. వీటిని డైరెక్ట్, క్యారీ ఫార్వార్డ్, ఆన్ ఫీల్డ్ కేటగిరీల్లో భర్తీ చేస్తారు. ఈ విధంగా ప్రతి శాఖలోని ఖాళీల వివరాలు ప్రతి ఏటా మార్చ్ 1 నుండి ఏప్రిల్ 30 లోపు ప్రభుత్వానికి అందిస్తారు, ప్రభుత్వం వీటిని పరిశీలించి, మే 1 నుండి జులై 31 లోపు ఆమోదిస్తుంది. ప్రభుత్వం ఆమోదం లభించిన అనంతరం ఈ ఉద్యోగాల భర్తీకి ఏపీపిఎస్సి అక్టోబర్ 15 లోపు చర్యలు తీసుకుంటుంది.

ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ మరెన్నో ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. ఇతర రాష్ట్రాలు పాటిస్తున్న కొన్ని మంచి విధివిధానాలను ఇక్కడ కూడా అమలు చెయ్యబోతున్నారు. రాజస్థాన్ లో ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు, పరీక్షా అనంతరం అక్కడికక్కడే మార్కులు స్క్రీన్ మీద కనిపిస్తాయి, మన రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అమలు చెయ్యనున్నారు. ఏపీపిఎస్సి లో ఐటీ విభాగాన్ని అవుట్ సోర్సింగ్ సిబందితో కాకుండా అదనపు డైరెక్టర్ ను నియమించి పర్యవేక్షించనున్నారు. అభ్యర్థులు పరీక్షలకు చెల్లించే ఫీజులు ప్రభుత్వానికి కాకుండా నేరుగా కమిటీకి వెళ్లేలా ప్రతిపాదించనున్నారు. ఈ ప్రతిపాదనలు అన్ని ప్రభుత్వానికి త్వరలోనే చేరనున్నాయి, ప్రభుత్వం వీటిని పరిశీలించి ఆమోదిస్తుంది.

Share your comments

Subscribe Magazine

More on Education

More