Education

Bank of Baroda Jobs 2022: ఈ అర్హతలతో బ్యాంకు అఫ్ బరోడాలో రాత పరీక్షా లేకుండా ఉద్యోగాలు ..

Srikanth B
Srikanth B
Bank of Baroda
Bank of Baroda

బ్యాంకు అఫ్ బరోడాలో వివిధ ఖాళీల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :

ఒప్పంద ప్రాతిపదికన 72 డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌,
డిజిటల్‌ లెండింగ్‌ రిస్క్‌ స్పెషలిస్ట్‌, స్పెషల్‌ అనలిస్ట్‌,
బిజినెస్‌ మేనేజర్‌, జోనల్‌ మేనేజర్‌ తదితర పోస్టుల (Digital Marketing Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పర్సనల్‌ లోన్‌, ఎంఎస్‌ఎంఈ లోన్‌, ఆటో లోన్‌, యూపీఐ, బీబీపీఎస్‌, ఫాస్టాగ్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, బీఎన్‌పీఎల్‌, డెబిట్‌కార్డ్‌, యూఐ/ యూఎక్స్‌ స్పెషలిస్ట్‌, లీడ్‌ కియాస్క్‌ ఆపరేషన్స్‌, డిజిటల్‌ పేమెంట్‌ ఫ్రాడ్‌ ప్రివెన్షన్‌, రెకన్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, డేటా ఇంజినీరింగ్‌, క్రియేటివ్‌ డిజైనింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హత ప్రమాణాలు :

పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీసీఏ/ఎంసీఏ/సీఏ/సీఎఫ్‌ఏ/ఎంబీఏ/పీజీ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

MP's కునో నేషనల్ పార్క్, ఆఫ్రికన్ చిరుతలకు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.https://www.bankofbaroda.in/career/current-opportunities లో అధికార నోటిఫికేషన్ పొందవచ్చు .

MP's కునో నేషనల్ పార్క్, ఆఫ్రికన్ చిరుతలకు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

Related Topics

Jobs in Bank of Baroda

Share your comments

Subscribe Magazine

More on Education

More