జేఎన్టీయూ హైదరాబాద్, విద్యార్థులు ఒకే విద్యా సంవత్సరంలో డబుల్ డిగ్రీలు చేసే విధానాన్ని ప్రారంభించింది.
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ఇటీవల నిర్వహించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాల సందర్భంగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా మార్కెటింగ్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల సిలబస్‌లో మార్పులు చేయాలని నిర్ణయించింది.ఇప్పుడు విద్యార్థులు ఏక కాలంలో రెండు డిగ్రీలను చేయవచ్చు.
అయితే వచ్చే విద్యా సంవత్సరం నుండి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) ఈ డబుల్ -డిగ్రీ విధానాన్ని అందించనుంది.ఇక విద్యార్థులు ఒకేసారి ఒక కోర్సు మాత్రమే చదివే రోజులకి కాలం చెల్లినట్లే.
బిటెక్‌తో పాటు త్వరలో విశ్వవిద్యాలయం ప్రారంభించబోయే BBA ప్రోగ్రామ్‌ను అభ్యసించడానికి విద్యార్థులు అనుమతించబడతారు అయితే వేరే ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా చదవడానికి విద్యార్థులకి అనుమతి ఉంది.
సిలబస్‌లో కొన్ని మార్పుచు చేస్తూ, నూతన సిలబస్ మూడు నుంచి ఐదేండ్ల పాటు అమలులో ఉండే విధంగా మరియు ఇంటర్నల్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, ఇక నుంచి 30 శాతం పాఠాలు ఆన్‌లైన్ పద్ధతిలో, 70 శాతం పాఠాలు తరగతి గదిలో బోధించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ డబుల్ డిగ్రీ ఎంతవరకు లాభం?
అయితే ఈ డబుల్ డిగ్రీ విధానం విద్యార్థులకు మేలు చేస్తుందా అనే విషయాన్నీ పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే, విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలను పొందేందుకు మరియు తద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని, విద్యావేత్తలు భావిస్తున్నారు.కెరీర్‌లో ముందుకు సాగడానికి అవసరమైన నిర్వాహక మరియు సాంకేతిక నైపుణ్యాలను పొందేందుకు ఈ విధానం విద్యార్థికి సహాయపడుతుంది.వివిధ రంగాలలో అనేక అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయి. అదనంగా విద్యార్థి ఏకకాలంలో రెండు డిగ్రీలను పూర్తి చేయగలడు కాబట్టి తాను సమయం మరియు డబ్బును కూడా ఆదా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని చదవండి.
Share your comments