తెలంగాణలోని యూనివర్సిటీలలో ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రకటించింది. మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. తెలంగాణ ఐసెట్ 2024 కు సంబంధించిన నోటిఫికేషన్ మార్చ్ 5న విడుదల చేసారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువిచ్చారు. అయితే అప్లికేషన్ కోసం మరింత సమయం కేటాయించాలని కొందరు అభ్యర్థులు కోరగా, ఈ గడువును మరో 7 రోజులకు పొడిగించి మే 7 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు.
మే 7 లోపు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు అదనంగా రూ.250 లేట్ ఫీజ్ చెల్లించి మే 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటుగా 700 రూపాయిల అదనపు ఆలస్య రుసుము చెల్లించి మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అప్లికేషన్ లో తప్పులను సరిచేసుకోవడానికి మే 17 న కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది.
పరీక్ష హాల్ టిక్కెట్లు మే 28 నుండి కాకతీయ యూనివర్సిటీ అధిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇకపోతే ఐసెట్ పరీక్షలు జూన్ 4,5 తేదీల్లో నిర్వహిస్తామని విద్యామండలి తెలిపింది. ఈ పరీక్ష మొత్తం మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలను జూన్ 28 న అధికారిక వెబ్సైటులో ప్రకటిస్తారు.
Share your comments