మన భారతదేశంలో యువత ఇంజినీరింగ్ మరియు వైద్య శాస్త్రం తరువాత అత్యధికంగా వ్యవసాయ శాస్త్రాన్నే చదువుతున్నారు. నేటి యువతకి వ్యవసాయ రంగం ప్రాముఖ్యత బాగా తెలిసింది. వ్యవసాయ శాస్త్రం చదివి వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావడానికి నేటి యువత ప్రయత్నిస్తుంది. వ్యవసాయం గురించి మరింత అవగాహన యువతలో కల్పించడానికి మరియు వారికి ఆర్ధికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది.
యువత ఆసక్తి చూపడంతో దేశంలో అగ్రికల్చర్ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ కశాళాలలు కూడా గణనీయంగా పెరిగాయి. దీనితోపాటు వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మరియు సాంకేతిక మార్పులతో వ్యవసాయ శాస్త్రం చదివే వారికి డిమాండు పెరుగుతోంది. ఈ వ్యవసాయ శాస్త్రాన్ని చదివే విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు వారికి ప్రతి నెల్ 2000 వేల రూపాయల నుండి 3 వేల రూపాయల వరకు స్కాలర్‌షిప్ అందించడానికి ఒక పథకాన్ని తీసుకువచ్చింది.
ఈ పథకాన్ని నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్స్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తుంది. ఈ పథకాన్ని భారత కేంద్ర వ్యవసాయ శాఖ మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి కలిపి భారతదేశంలో అమలు చేస్తున్నాయి. ఈ స్కాలర్‌షిప్ పొందడానికి విద్యార్హత ఏమిటి, ఎవరికీ ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది, విద్యార్థులకు ఎలా అందిస్తుంది మరియు ఈ స్కాలర్‌షిప్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్: పొలం దగ్గరే ధాన్యం ఆరుదల..యంత్రానికి 60% వరకు సబ్సిడీ!
కేంద్ర ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) దేశంలో వ్యవసాయ విద్యను బలపరచాలని నిర్ణయించుకున్నాయి. దీనికొరకు దేశంలో అగ్రికల్చర్ కోర్సు చదివే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులకు ఆర్థికంగా ప్రోత్సహం అందించాలని వారికి ఈ నేషనల్ టాలెంట్ స్కాలర్‌షిప్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాస్త్రంలో అగ్రికల్చర్ కోర్సు చదివే విద్యార్థులకు నెలకు రూ.2000 మరియు పీజీ విద్యార్థులకు నెలకు రూ.3000 ప్రతిభను బట్టి ఇవ్వడానికి నిర్ణయించింది ప్రభుత్వం.
దేశంలో ఏ ఐసీఏఆర్ గుర్తింపు పొందిన వ్యవసాయ కళాశాలలు లేదా యూనివర్సిటీలలో చదివే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. ఈ కళాశాలల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ కోర్సులను విద్యార్థులు చదువుతున్నారు. వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్: పొలం దగ్గరే ధాన్యం ఆరుదల..యంత్రానికి 60% వరకు సబ్సిడీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలు, కళాశాలల్లో దాదాపు నాలుగు వేల మందికిపైగా విద్యార్థులు ఈ తరహా స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారు. ఈ స్కాలర్‌షిప్ కి ఎవరు అర్హులు అంటే ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఈఈ) ద్వారా ఐసీఏఆర్ గుర్తింపు పొందిన అగ్రికల్చర్ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు. డొనేషన్ లేదా మేనేజ్‌మెంట్ కోటా కింద చేరిన విద్యార్థులు స్కాలర్‌షిప్ కి అర్హులు కాదు.
ఈ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థులు ఐసీఏఆర్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులు స్వీకరించరు.
https://education.icar.gov.in/Event_details?component=NTS&DegProg=UG&SchemeCode=NTSU ఈ వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తు సబ్‌మిట్ చేయొచ్చు.
దరఖాస్తు కొరకు కావలసిన పత్రాలు
విద్యార్థి ఫొటోగ్రాఫ్
సంతకం
వేలిముద్ర
అధికారులు ఇచ్చిన కండక్ట్, స్టడీ మెరిట్ సర్టిఫికెట్లు
ఆధార్‌కార్డు
బ్యాంకు ఖాతా వివరాలు
వివరాలకు ఎవర్ని సంప్రదించాలి?
https://www.icar.org.in/ వెబ్‌సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. 011-25847121 నంబరులో ఫోను ద్వారా ఐసీఏఆర్ అధికారులను నేరుగా సంప్రదించవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments