గత కొన్ని నెలలుగా స్కాలర్‌షిప్‌లు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు శుభవార్త. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి విడుదలపై హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో సమీక్షా నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి ఈ మేరకు ఆదేశాలను జారీ చేసారు , దీనితో త్వరలోనే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు విడుదల కానున్నాయి .
ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధింత శాఖలు తిరిగి ట్రెజరీకి సమర్పించాలని, ఆ బిల్లులను వెంటనే ట్రెజరీ అధికారులు క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి హరీశ్ రావు. దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను విడుదల చేయాలన్నారు మంత్రి హరీశ్ రావు.
ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన రూ. 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్ రావు. దీంతో పాటు మార్చి 31 వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విగలాంగులు, ఈబీసీ, మైనార్టీ శాఖల నుంచి బిల్లులు అందలేదన్న కారణంతో.. ట్రెజరీ అధికారులు తిప్పి పంపారని అధికారులు వివరించడంతో దీనిపైన సమీక్షించారు మంత్రి హరీశ్ రావు.
రైతుబంధు డబ్బులు అకౌంట్లోకి వచ్చాయా? లేదా? తెలుసుకోండిలా?
ఇదికూడా చదవండి .
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ, తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.ఇంజనీరింగ్ విభాగంలో 1,522 పోస్టులు, నీటిపారుదలశాఖలో 704 ఏఈఈ, 227 ఏఈ, 212 టెక్నికల్ పోస్టులకు అనుమతినిచ్చింది. అలాగే నీటిపారుదలశాఖలో 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి అనుమతినిచ్చింది.
Share your comments