తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్టెట్-2023) పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టీఎస్టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల అనగా ఆగష్టు 16వ తేదీ చివరి తేదీ. అవకాశం ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కోరింది. కాగా విద్యాశాఖ ఈ పరీక్ష ప్రక్రియ మొత్తం కేవలం రెండు నెలల్లోనే పూర్తయ్యేలా షెడ్యూల్ వేసింది.
ఈ టీఎస్టెట్ పరీక్షను వచ్చేనెల సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ పరీక్ష యొక్క మొదటి పేపర్ సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు జరగనుంది మరియు రెండవ పేపర్ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండనుంది.
ఈ టెట్ పరీక్ష రాయడానికి ఆఖరి సంవత్సరం చదువుతున్న డీఈడీ, బీఈడీ స్టూడెంట్లు కూడా అర్హులు అని విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి tstet.cgg.gov.in వెబ్సైట్ ని సందర్శించవచ్చు. కాగా, మొత్తం 33 జిల్లాల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అభ్యర్థి తనకు నచ్చిన జిల్లాను ఎంచుకోవచ్చు. అభ్యర్థులు తమకు నచ్చిన జిల్లాలో పరీక్ష రాసే అవకాశం పొందడానికి ముందుగా అప్లై చేసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త : నేటినుంచి లక్ష రుణమాఫీ
పేపర్-1 (ఐదో తరగతి వరకు టీచర్), పేపర్-2 (ఆరు నుంచి 8వ తరగతి వరకు టీచర్) కు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. అయితే బీఈడీ చేసినోళ్లు రెండు పేపర్లు రాసేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పేపర్ 1 అభ్యర్థులు టెన్త్ వరకు, పేపర్ 2 అభ్యర్థులు ఇంటర్ వరకు సిలబస్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ రెండు భాషల్లో ఉంటుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.400 ఎగ్జామ్ ఫీజు చెల్లించాలి.
ఇది కూడా చదవండి..
Share your comments