గత కొన్ని వారాలుగా తెలంగాణ నిరుద్యోగులు ఆగస్టు చివరన జరగనున్న గ్రూప్ 2 పరీక్షను రద్దు చేయాలనీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఆగస్టు చివరి వారంలో జరిగే గ్రూప్ 2 పరీక్షా పై కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. గ్రూప్-2 పరీక్షను యదావిధిగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో ‘ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే….’రిక్రూట్మెంట్ దశలవారీగా చేయాలని ముందే చెప్పాం. ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చాం. నేను ఇంతకుముందే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదు. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. అలా చేస్తే ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయి.
విద్యార్థులకు గమనిక! ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. మారిన తేదీలు ఇవే?
దీనితో ఆగస్టు చివరిలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షా నిర్ణయించిన తేదీననే జరగనుంది . కావున అభ్యర్థులు పరీక్షకు సన్నధం కావాలి .
Share your comments