Education

టెక్కీలకు శుభవార్త... జెనెరేటివ్ ఏఐ విభాగంలో శిక్షణ

KJ Staff
KJ Staff

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ లేదా కుత్రిమ మేధా ప్రతీ రంగంలోనూ విశేషమైన పాత్ర పోషిస్తుంది. మనుషులకు సాధ్యపడని పనులు కూడా ఏఐ సమయంతో సులువుగా పూర్తిచేసుకోవచ్చు. కృతిమా మేధా మీద మంచి పట్టున్న టెక్ రంగాల వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ఈ కృతిమ మేధస్సు మీద తమ ఉద్యోగస్తులకు అవగాహనా కల్పించడం కోసం ఎన్నో కంపనీలు చురుకుగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ తో అవకాశాలు ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు అన్ని టెక్ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆ దోవలోనే ప్రముఖ టెక్ కంపెనీ హెచ్సిఎల్ తమ కంపెనీలో ఉద్యోగస్తులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది.

కృత్రిమ మేధలో ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు 25,000 మందికి శిక్షణ ఇవ్వగా మరో 50,000 మందికి ఈ ఏడాదిలో శిక్షణ పూర్తిచేస్తామని తెలియచేసారు. ప్రస్తుతం ఈ కంపెనీ వృధి రేటు 5.4% గా నమోదయ్యింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ పరిస్థితి ఇలాగె కొనసాగితే రానున్న రోజుల్లో 10,000 మందికి ఉద్యోగాలిస్తామన్నారు. పరిస్థితుల మార్పులను బట్టి ఫ్రెషర్లకు కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది.

గడిచిన త్రైమాసికంలో 2700 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు హెచ్సిఎల్ సంస్థ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో క్లౌడ్ మరియు జెనెరేటివ్ ఏఐ ప్రాజెక్టులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లు విజయ్ కుమార్ అంచనా వేస్తున్నారు. కృతిమ మేధా వలన ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి, దీని వలన ఆర్ధిక సేవల విభాగంలో ఇబ్బందులు తలత్తే పరిస్థితి కనిపిస్తుంది.

Share your comments

Subscribe Magazine

More on Education

More