Education

IAF Recruitment 2022:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో తాజా ఖాళీలు...ఇంటర్ పాసైతే చాలు!

S Vinay
S Vinay

భారత వైమానిక దళం గ్రూప్ c పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

దరఖాస్తు గడువు:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 21 జూన్ 2022 చివరి తేదీ.

ఉద్యోగం:
గ్రూప్ 'సి' సివిలియన్

విద్యార్హత వివరాలు:
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత, కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు టైపు చేయగలగాలి.

జీతం వివరాలు:
జీతం 7th పే కమీషన్ ప్రకారం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:
ముందుగా దరఖాస్తుదారుల కనీస అర్హతలు, ధ్రువ పత్రాలను సమీక్షించాక అర్హులైన అభ్యర్థులకు వ్రాత పరీక్ష కోసం కాల్ లెటర్లు జారీ చేయబడతాయి. అర్హత గల అభ్యర్థులు వ్రాత పరీక్ష రాయవలసి ఉంటుంది. వ్రాత పరీక్ష కనీస విద్యా అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
వ్రాత పరీక్ష సిలబస్‌లో ఉండే అంశాలు :
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్ మరియు జనరల్ అవేర్‌నెస్.

దరఖాస్తు చేయడం ఎలా?
అభ్యర్థులు ఇంగ్లీషు/హిందీలో టైప్ చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఇటీవలి పాస్‌పోర్ట్ ఫోటోను మరియు ఇతర విద్యార్హత ధ్రువ పత్రాలను జత చేసి పోస్ట్ ద్వారా కింద సూచించిన చిరునామా కి పంపగలరు.

Presiding Officer, Civilian Recruitment Board, Air Force Record Office, Subroto Park, New Delhi-110010’.

మరింత సమాచారం కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించగలరు.

indianairforce.nic.in

మరిన్ని చదవండి

కిసాన్ క్రెడిట్ కార్డు లాభాలు...దరఖాస్తు చేయడం ఎలా?

Share your comments

Subscribe Magazine

More on Education

More