Education

సంచలన నిర్ణయం: ఇక నుండి పాఠశాలల్లో వ్యవసాయం ఒక సబ్జెక్టు!

S Vinay
S Vinay

జాతీయ విద్యా విధానం (National Education Policy), విద్యార్థులకి మెరుగైన విద్యను అందించడానికి వ్యవసాయ శాస్త్రంతో సహా వృత్తిపరమైన పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ విద్యా వ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) పాఠశాల విద్యలో ప్రధాన స్రవంతి వ్యవసాయ పాఠ్యాంశాలపై మేధోమథన సెషన్‌ను నిర్వహించింది. దీనిని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ తోమర్ మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిందని, ఎక్కువ మంది జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, కొత్త విద్యా విధానంతో వ్యవసాయ ప్రపంచాన్ని ఏకీకృతం చేయడానికి ICAR ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు.

జాతీయ విద్యా విధానం (NEP), 2020 ప్రకారం మెరుగైన విద్యను అందించడానికి వ్యవసాయ శాస్త్రంతో సహా వృత్తిపరమైన పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ విద్యా వ్యవస్థను రూపొందించడంపై దృష్టి పెట్టడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. అందువల్ల, ప్రాథమిక, మధ్య మరియు మాధ్యమిక పాఠశాలల్లో కొత్త నమూనా ప్రవేశపెట్టబడుతుంది. పాఠశాల స్థాయిలో, విద్యార్థులు అభివృద్ధి కోసం వ్యవసాయం మరియు అనుబంధ శాస్త్రాలలో ఉన్నత స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. ఫలితంగా, వ్యవసాయాన్ని పాఠ్యాంశాల్లో ఒక సబ్జెక్ట్‌గా చేర్చడానికి మరియు వ్యవసాయంలోని వివిధ రంగాలలో వృత్తిని కొనసాగించడానికి విద్యార్థులకు ఒక మంచి అవకాశాన్ని అందించడానికి ఈ నూతన విధానాన్ని రూపొందించనున్నారు.

ఇటీవల, కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం రానించిందని, నిరంతర వ్యవసాయ అభివృద్ధికి, తగిన పెట్టుబడి మరియు సాంకేతిక మద్దతు అవసరం అని ఆ దిశగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (Indian Council of Agricultural Research) నిరంతర కృషి చేస్తుందని తెలిపారు.

అయితే పాఠశాల స్థాయిలో వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టు గ చేరిస్తే విద్యార్థులకి భారతీయ వ్యవసాయం పై మంచి అవగాహనా వస్తుందని దీని వలన మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు విశ్వాసం వ్యక్త్యం తెలియజేస్తున్నారు.

మరిన్ని చదవండి.

వాతావరణ మార్పుల వలన ప్రపంచ వ్యాప్తంగా టమాటా ఉత్పత్తి పై ప్రభావం!

Share your comments

Subscribe Magazine

More on Education

More