జూలై 2022 సెషన్ కోసం దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ(Indira Gandhi National Open University) మరోసారి పొడిగించింది.
ఇంకా తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించని అభ్యర్థులు, వారు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 9 సెప్టెంబర్ 2022లోపు దరఖాస్తును సమర్పించాలి. ఇంతకు ముందు జూలై సెషన్ 2022 కోసం రీ-రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 25 ఆగస్టు 2022గా ఉండేది. IGNOU సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో రీ-రిజిస్ట్రేషన్ పొడిగించిన తేదీ (IGNOU జూలై 2022) గురించి సమాచారాన్ని అందించింది.
దరఖాస్తు ఫీజు..
IGNOU తన అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి నోటీసును కూడా జారీ చేసింది. మరింత సమాచారం కోసం.. అభ్యర్థులు జారీ చేసిన నోటీసును తనిఖీ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం.. అభ్యర్థి రూ. 250 రుసుము చెల్లించాలి. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
యూనివర్సిటీలోని ఏదైనా కోర్సులో ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అభ్యర్థులు తదుపరి సెషన్‌లో తమ అధ్యయనాలను కొనసాగించాలనుకుంటే చివరి తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అదనంగా.. ప్రస్తుతం విశ్వవిద్యాలయం అందించే ఏదైనా కోర్సులు అండ్ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న విద్యార్థులు గడువు కంటే ముందే రీ-ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తుదారులు తిరిగి నమోదు ప్రక్రియను పూర్తి చేయకుండా తదుపరి సెమిస్టర్‌కు ఏ అభ్యర్థిని అనుమతించరని గమనించాలి.
రీ-రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి..
ముందుగా అభ్యర్థులు IGNOU అధికారిక వెబ్‌సైట్ https://ignou.samarth.edu.inకి వెళ్లండి.
ఇప్పుడు అభ్యర్థి రీ-రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్చేయండి.
అభ్యర్థులు వారి నమోదు ID అండ్ ప్రోగ్రామ్ కోడ్‌ను నమోదు చేయాలి.
ఆ తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫీజును సమర్పించాలి.
ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ లో పేర్కొన్న వివరాలను నమోదు చేయాలి. తర్వాత ఫైనల్ సబ్ మిట్ చేయాలి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కొరకు అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి.
Share your comments