Education

ఏపీ పశుసంవర్ధక శాఖలో రాత పరీక్షలేకుండా ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకొండి

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి కాళీలు ఉన్నట్లు ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అనిమల్‌ హస్బెండరీ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదని తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వ్యక్తులకు జీతం అనేది రూ.54,060ల నుంచి రూ.1,40,540 వరకు చెల్లిస్తారు.

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖలో ఉంద్యోగాలనేవి ఎస్టీ బ్యాక్‌లాగ్ కేటగిరీ కింద మొత్తానికి 27 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అనిమల్‌ హస్బెండరీ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవలసిందిగా పశుసంవర్ధక సఖ కోరుతుంది. కాబట్టి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి, వారు వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ లేదా మైక్రోబయాలజీ/పాథాలజీ/పారాసిటాలజీ/ఎపిడెమియాలజీ/వైరాలజీ/ఇమ్యునోలజీ/బయో కెమిస్ట్రీ/వెటర్నిటీ పబ్లిక్‌ హెల్త్‌లో పోస్టుగ్రాడ్యయేషన్‌ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ పోస్టులకు అర్హులైన వ్యక్తులు కచ్చితంగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ఈ ఉంద్యోగాలకు అర్హులు కావడానికి అభ్యర్థుల యొక్క వయస్సు అనేది జులై 1, 2022 తేదికి 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి.

ఇది కూడా చదవండి..

ఏపీలో ఆర్బీకేలో 7,384 పోస్టుల భర్తీ కొరకు త్వరలో నోటిఫికేషన్..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల అనగా మర్చి 20 అనేది చివరి తేదీ. అర్హులు ఈ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకువడానికి ఆఫ్‌లైన్‌ విధానంలోనే చేసుకోవాలి. మీ దరఖాస్తులను పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, NTR VSH క్యాంపస్, లబ్బీపేట, ఆంధ్రప్రదేశ్, విజయవాడ - 520010 ఈ అడ్రెస్కు సమర్పించాలి. అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదుకాని ఇంటర్వ్యూ మరియు రిజర్వేషన్‌ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

ఇది కూడా చదవండి..

ఏపీలో ఆర్బీకేలో 7,384 పోస్టుల భర్తీ కొరకు త్వరలో నోటిఫికేషన్..

Share your comments

Subscribe Magazine

More on Education

More