హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పంజాగుట్టలోని ఈ వైద్య సంస్థలో ఉన్న మెడికల్ జెనెటిక్స్ ల్యాబ్‌లో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు .? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇక్కడ
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ (సైటోజెనెటిక్స్), సాంకేతిక నిపుణుడు (సైటోజెనెటిక్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు ఎంఎస్సీ (జెనెటిక్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ), బీఎస్సీ(లైఫ్ సైన్సెస్), ఎంఎల్‌టీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.అభ్యర్థుల వయసు టెక్నికల్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు మించకూడదు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
సంబంధిత సర్టిఫికేట్‌లతో దరఖాస్తులను ద డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణకు 26-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా అభ్యర్థులు సమాచారం అందిస్తారు.
టీఏ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 35,000, టెక్నీషియన్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 25,000 అందిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
Share your comments