మీరు ఇంటర్ ఉత్తీర్ణత సాధించారా? అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి. ఇండియన్ నేవీ ప్రస్తుతం 1,365 అగ్నివీర్ స్థానాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో 273 మహిళా దరఖాస్తుదారుల కోసం కేటాయించారు. అర్హత సాధించడానికి, అభ్యర్థులు తమ ఇంటర్‌లో కనీసం గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం లేదా కంప్యూటర్ సైన్స్ లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణుత సాధించి ఉండాలి.
అభ్యర్థులు నవంబర్ 1, 2002 మరియు ఏప్రిల్ 30, 2006 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్న వ్యక్తులు మరింత సమాచారం కోసం https://agniveernavy.cdac.in/ వద్ద అగ్నివీర్నవీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 15, ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 30,000. దరఖాస్తుదారులు తప్పనిసరిగా అవివాహితులై ఉండాలి మరియు పరీక్ష రుసుము రూ. 550 చెల్లించాలీ.
నేవీ అగ్నివీర్ ఉద్యోగం కోసం ఎంపిక ప్రక్రియ రెండు దశలను కలిగి ఉంటుంది, అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఆన్‌లైన్ పరీక్షతో కూడిన ప్రాథమిక దశలో ఉంటుంది. రెండవ దశలో వ్రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT) మరియు వైద్య పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
ఇది కూడా చదవండి..
తుఫాను హెచ్చరిక: ఉత్తర భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక జారీ..
దరఖాస్తు ఇలా చేసుకోండి..
➔ అభ్యర్థులు ముందుగా అగ్నివీర్ వెబ్‌సైట్ https://agniveernavy.cdac.in/ని సందర్శించి లాగిన్ చేసుకోవాలి.
➔ ఆ వెబ్సైట్ లో హోమ్ పేజీకి వెళ్లి అగ్నివీర్ లింక్‌పైన క్లిక్ చేయాలి.
➔తరువాత అక్కడ అడిగే వివరాలు అనగా ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి ఎంటర్ చేయాలి.
➔ రిజిస్ట్రేషన్ తర్వాత అవసరమైన వివరాలను నింపండి. మీ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.
➔ అక్కడ అడిగితే కావలసిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
➔ తరువాత దరఖాస్తు రుసుమును చెల్లించాలీ.
➔ మీరు రుసుము చెల్లించాక ఫామ్ ను సమర్పించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..
Share your comments