మెదక్ లో గల కృషి విజ్ఞాన కేంద్రం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
డాక్టర్ రామానాయుడు-ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతున్న కృషి విజ్ఞాన కేంద్రం మెదక్-2 (తునికి) పథకం ద్వారా కింది ఖాళీలను ప్రకటించడం జరిగింది.
ఉద్యోగ ఖాళీ వివరాలు:
పోస్ట్:సీనియర్ సైంటిస్ట్ &హెడ్ (Senior Scientist and Head)
అర్హత:
సంబంధిత సబ్జెక్ట్‌లో డాక్టోరల్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టులో సైంటిస్ట్/లెక్చరర్/ఎక్స్‌టెన్షన్ స్పెషలిస్ట్‌గా 8 సంవత్సరాల అనుభవం.
పోస్ట్:-సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/T-6 (అగ్రోనమీ)
విద్యార్హత: అగ్రికల్చర్‌లో మాస్టర్స్ డిగ్రీ ( అగ్రోనమీ ) లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సమానమైన అర్హతలు.
ఉద్యోగ అనుభవం: KVKలలో రెండేళ్ల పని అనుభవం.
పోస్ట్:-ప్రోగ్రామ్ అసిస్టెంట్ (సాయిల్ సైన్స్)
విద్యార్హత: అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సమానమైన అర్హతలు
ఉద్యోగ అనుభవం: M.SC (Soil Science) (లేదా) KVKలలో రెండేళ్ల పని అనుభవం.
పోస్ట్:-ఆఫీస్ అసిస్టెంట్
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ
ఉద్యోగ అనుభవం:కంప్యూటర్లు & ఖాతాల పని పరిజ్ఞానం, ఏదైనా సంస్థలో సంబంధిత అనుభవం.
పోస్ట్:-స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ (SSS)
విద్యార్హత: మెట్రిక్యులేషన్ పాస్ లేదా తత్సమానం లేదా ఐటీఐ ఉత్తీర్ణత.
వ్యవసాయ నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
KVK RECRUITMENT 2022: దరఖాస్తు చేయడం ఎలా?
దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి .
మీరు అధికారిక నోటిఫికేషన్‌లో జతపరిచి ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను పూరించి క్రింది సూచించబడిన చిరునామాకు పోస్ట్ చేయగలరు.
Senior Scientist & Head, Dr. Ramanaidu-Ekalavya Foundation Krishi Vigyan Kendra, Tuniki, Kowdipally, Medak – 502 316.
KVK RECRUITMENT 2022: దరఖాస్తుకి చివరి తేదీ
25 జూన్ 2022 లోపు దరఖాస్తు చిరునామాకు చేరుకోవాలి.
పూర్తి సమాచారానికి అభ్యర్థులు official notification చూడగలరు.
మరిన్ని చదవండి.
Share your comments