కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) 13,165 వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి మరియు అర్హత కల్గిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పంపవచ్చు.
ఖాళీల వివరాలు:
1) ప్రైమరీ టీచర్ పోస్టులు - 6414
అర్హత :సీనియర్ సెకండరీ, డీఈఎల్ఈడీ, డీఈ ఎల్ ఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్ ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత తో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్ 1లో అర్హత సాధించి ఉండాలి. 30 సంవత్సరా
లకు మించకూడదు.
ఎంపిక :రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
2) పీజీటీ ,టీజీటీ ,పోస్టులు -6990
అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్ (సంగీతం), లైబ్రేరియన్ మొదలైన పోస్టులు ఇందులో ఉన్నాయి .
అర్హత :సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సెంట్రల్ టీచర్ ఎలిజిబి లిటీ టెస్ట్ (సీటెట్) పేపర్ 2 అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక :రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఉపాధ్యాయులు హిందీ మాధ్యమంలో కూడా బోధించగలగాలి. C-TET అర్హతతో సహా వివరణాత్మక ప్రమాణాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు చివరి తేదీ :
అభ్యర్థులు డిసెంబర్ 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పంపవచ్చు.ఆసక్తి మరియు అర్హత లేని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.kvsangathan.nic.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి .
- దరఖాస్తు రుసుము:
అసిస్టెంట్ కమీషనర్, ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు దరఖాస్తు రుసుము 2300 రూపాయలు - సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు 1200,
- ఇతర పోస్టులకు 1500.
షెడ్యూల్డ్ కులాలు, మరియు వికలాంగ దరఖాస్తుదారులకు ఎటువంటి రుసుము లేదు.
Share your comments