నవోదయ లో ఆరో తరగతి ప్రవేశాలుకు నోటిఫికేషన్ విడుదల.. జనవరి 31 దరఖాస్తు చివరి తేదీ ...
నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti) )- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిVI లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కల్గిన విద్యార్థులనుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది . నవోదయాలో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులు JNVST జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది . JNVST టెస్టు లో పొందిన మార్కుల ఆధారముగా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు .
దేశవ్యాప్తంగా మొత్తం 649 జేఎన్‌వీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 13 విద్యాలయాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు మరో రెండు విద్యాలయాలు కేటాయించారు. తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో ఆరోతరగతిలో గరిష్ఠంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత జేఎన్‌వీల్లో గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు ప్రత్యేకించారు.
అర్హత: ప్రస్తుతం ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు , 011 మే 1 నుంచి 2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి విద్యార్థులు దీనికి అర్హులు .
|
పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్ |
ప్రశ్నలు - 100 |
సిలబస్ :మెంటల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు |
అర్థమెటిక్ , లాంగ్వేజ్ నుంచి 20 చోపున్న |
పరీక్షా సమయం :2 గంటలు |
పరీక్ష బాషా :తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ |
ఈ వారంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు TSPSC కసరత్తు
దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు :
NVS యొక్క అడ్మిషన్ పోర్టల్ https://navodaya.gov.in లో విద్యార్థులు అప్లికేషన్ సమర్పించాలి .
- విద్యార్థి ఫొటో
విద్యార్థి సంతకం
తల్లి/ తండ్రి సంతకం
ఆధార్ కార్డ్/ రెసిడెన్షియల్ సర్టిఫికెట్
స్కూల్ హెడ్‌మాస్టర్ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికెట్
అన్ని ఫైల్ లు జేపీజీ ఫార్మాట్‌లో 10 నుంచి 100 కేబీ మధ్య సైజ్‌లో ఉండాలి.
- ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31 - జేఎన్వీ సెలెక్షన్ టెస్ట్ తేదీ: ఏప్రిల్ 29
-
ఈ వారంలోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు TSPSC కసరత్తు
Share your comments